నేటితో 172 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇండియన్ రైల్వే...
బండి బండి రైలు బండీ.. వేలకంటూ రాదులెండి అంటూ భారతీయ రైల్వే ప్రయాణం మీద అప్పట్లో ఒక పాట వచ్చింది. ఆ పాట ఏదో ఆ సిచ్యువేషన్ కోసం రాసుకొని సరదాగా చిత్రీకరించారు కానీ.. మన దేశంలో నిత్యం కోట్లాది మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది 'భారతీయ రైల్వే'. తక్కువ ఖర్చుతో ప్రయాణం అందిస్తూ.. కేవలం రవాణా మార్గం గానే కాకుండా.. రైలు ప్రయాణం అనేది కోట్లాది మంది జీవితాల్లో భాగంగా మారింది. ఇప్పుడు భారతీయ రైల్వే చరిత్రలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
భారతీయ రైల్వే మరో నూతన ఏడాది లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్టులో.. 172 సంవత్సరాల క్రితం, అంటే 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో రైల్వేలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు ముంబయిలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఆ రోజున అక్కడ ప్రభుత్వ సెలవు ప్రకటించారు. మధ్యాహ్నం 3:35 గంటలకు, బోరీ బందర్ నుంచి తొలిసారిగా 14 బోగీలతో కూడిన రైలు ఠాణే వైపు ప్రయాణం ప్రారంభించిందని రాసుకొచ్చారు. అలానే ఆ రైలుకు 21 తుపాకీ గుంజులతో సెల్యూట్ ఇచ్చారు.

ఆ రైలులో 400 మంది ఆహ్వానిత ప్రయాణికులు ఉన్నారు. ఆ రైలును 'సింద్', 'సుల్తాన్', 'సాహెబ్' అనే పేర్లున్న మూడు ఇంజిన్లు లాగాయి. ఆ రైలు 34 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 15 నిమిషాల్లో పూర్తిచేసింది. అప్పటి నుంచి భారతీయ రైల్వే దేశ ప్రజలకు సేవలందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.
అంతే కాకుండా ఆ పోస్టుతో పాటు తొలి రైలు వెళ్తున్న ఫోటోను.. ఇటీవల దేశంలో నిర్మించిన మూడు అద్భుత రైల్వే వంతెనల ఫొటోలను ఆయన పోస్టు చేశారు. ఆ మూడు ఫొటోల్లో జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న చెన్నాబ్ బ్రిడ్జ్, అసోంలోని బోగిబీల్ బ్రిడ్జ్ బ్రహ్మపుత్ర నదిపై నిర్మితమైన ద్విమార్గ వంతెన... అంజి ఖాడ్ బ్రిడ్జ్ ఉన్నాయి.
ఇప్పుడు భారతీయ రైల్వే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ఎదిగింది. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ వ్యవస్థ.. ప్రస్తుతం ఆధునికత వైపు వేగంగా దూసుకుపోతుంది. దేశవ్యాప్తంగా వందశాతం ఎలక్ట్రిఫికేషన్ అందిస్తోంది. అంతే కాకుండా వందల బులెట్ ట్రైన్ ప్రాజెక్టులు, వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు... ఇవన్నీ కలిసి భారత రైల్వేను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయి.
172 वर्ष पहले भारत में रेल (Rail) की शुरुआत 16 अप्रैल 1853 को हुई। मुम्बई में वह दिन ऐतिहासिक था। उस दिन वहाँ सार्वजनिक अवकाश घोषित कर दिया गया था। उस दिन दोपहर तीन बजकर पैंतीस मिनट पर 21 तोपों की सलामी के साथ बोरीबंदर से ठाणे के लिए पहली बार 14 डिब्बों की एक ट्रेन रवाना हुई थी।… pic.twitter.com/IFEJupTz3W
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 16, 2025
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications