వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ఛార్జీలు, లోయర్ బెర్తుల కేటాయింపు ఇలా..!!
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది.
ఈ పరిణామాల మధ్య ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కుతున్నాయి. హౌరా-కామాఖ్య మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. నంబర్ 27575 హౌరా- కామాఖ్య వందే భారత్ స్లీపర్ గురువారం మినహా మిగిలిన అన్ని రోజులలో నడుస్తుంది. నంబర్ 27576 కామాఖ్య- హౌరా రైలు బుధవారం మినహా ఇతర అన్ని రోజులు రాకపోకలు సాగిస్తుంది. తాజాగా ఈ రైళ్లకు సంబంధించిన ఛార్జీలు, టికెటింగ్ నిబంధనలను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

- 1AC, 2AC, 3AC క్లాస్ లకు ప్రత్యేక బేసిక్ ఛార్జీలు.. రైలులో అందుబాటులో ఉండే అన్ని సర్వీస్ లనూ కవర్ చేస్తాయి. దీనికి జీఎస్టీ మాత్రం అదనం.
- 400 కిలోమీటర్ల దూరానికి కనీస ఛార్జీని నిర్ధారించారు. 400 నుండి 3,500 కిలోమీటర్ల వరకు ప్రయాణాలకు 1ACలో రూ. 1,520 నుండి రూ. 13,300, 2ACలో రూ. 1,240 నుండి రూ. 10,850, 3ACలో రూ. 960 నుండి రూ. 8,400 వరకు ఛార్జీలు వర్తిస్తాయి.
- వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లో కన్ఫర్మ్డ్ టిక్కెట్లను మాత్రమే జారీ చేస్తారు. ఆర్ఏసీ (RAC) గానీ, వెయిటింగ్ లిస్ట్ గానీ ఉండదు. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) ప్రారంభం నుంచే అన్ని బెర్త్‌లు బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయి.
- రిజర్వేషన్ కోటాల విషయానికి వస్తే, మహిళలు, దివ్యాంగులు (PWD), సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ కలిగిన వారికి మాత్రమే నిర్దేశిత కోటాలు వర్తిస్తాయి. ఈ రైళ్లలో ఇతర రిజర్వేషన్ కోటాలు ఉండవని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.
- పిల్లల ఛార్జీల నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయి.
- టికెట్ల కొనుగోలుకు పూర్తిగా రీయింబర్స్ అయ్యే పాస్‌లు/వారెంట్లకు మాత్రమే అనుమతి ఇస్తారు. రైల్వే ఉద్యోగుల డ్యూటీ పాస్ అర్హతలు రాజధాని తరహా రైళ్లతో సమానం. రాయితీ టిక్కెట్లు లేదా రీయింబర్స్ కాని ఉచిత పాస్‌లు ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లలో చెల్లవు.
- టికెట్ కొనుగోలుకు చేసిన అన్ని చెల్లింపులు డిజిటల్‌గా మాత్రమే జరుగుతాయి. కౌంటర్లలో కూడా డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యత ఇస్తారు. టిక్కెట్ రద్దు అయిన 24 గంటలలోపు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ డిజిటల్ చెల్లింపు సాధ్యం కాకపోతే రీఫండ్ సాధారణ నిబంధనల మేరకే ఉంటుంది.
- ప్రయాణ సమయంలో ప్రత్యేక బెర్త్ అవసరం లేని పిల్లవాడితో ప్రయాణిస్తున్నవారికి, లభ్యతను బట్టి లోయర్ బెర్త్ కేటాయిస్తారు. అలాగే, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు కూడా లభ్యతను బట్టి ఆటోమేటిక్‌గా లోయర్ బెర్తులు కేటాయిస్తారు.
ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయాలని CRIS (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్)ను రైల్వే బోర్డు ఆదేశించింది. అలాగే, అన్ని జోనల్ రైల్వేలు ఈ వివరాలను తమ సిబ్బందికి ముందుగానే తెలియజేయాలని సూచించింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications