Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Railways: భారతీయ రైల్వే అతిపెద్ద నిర్ణయం-ప్రతీ ప్రయాణికుడికీ కన్ఫమ్ టికెటే లక్ష్యం...

దేశవ్యాప్తంగా అతిపెద్ద నెట్ వర్క్, ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ సంస్ధగా ఉన్న భారతీయ రైల్వేలు ఇప్పుడు మరో కీలక అడుగు వేయబోతున్నాయి. దేశంలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే వందే భారత్ రూపంలో అత్యాధునిక రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వేలు ఇప్పుడు మరో నాలుగేళ్లలో మరో అతిపెద్ద మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నాయి.

2027 నాటికి దేశంలో ప్రతీ రైలు ప్రయాణికుడికీ కన్ఫమ్ టికెట్ లభించేలా రైల్వే కసరత్తు ప్రారంభించినట్లు తాజాగా జాతీయ ఛానల్ ఎన్డీటీవీకి రైల్వే వర్గాలు వెల్లడించాయి. రైల్వేల భారీ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఇకపై ప్రతీ రోజూ కొత్త రైళ్లను ప్రస్తుత నెట్ వర్క్ కు జోడించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి. దీంతో ఇక రద్దీతో సంబంధం లేకుండా ప్రతీ ప్రయాణికుడికీ రైలు ఎక్కేందుకు కన్ఫమ్ టికెట్ లభించనుందని వెల్లడించాయి.

indian railways plan big expansion by 2027 to ensure confirmed tickets to every passenger

ఇకపై ప్రతీ ఏడాది రైల్వేలు కొత్త ట్రాక్ లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏటా 4 నుంచి 5 వేల కిలోమీటర్ల నెట్ వర్క్ ను పెంచుకుంటూ పోతామని రైల్వే వర్గాలు చెప్తున్నాయి. అలాగే ప్రస్తుతం రోజుకు 10,748 రైళ్లు నడుస్తున్నాయని దీన్ని 13,000 రైళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాయి. వచ్చే 3-4 సంవత్సరాల్లో 3,000 కొత్త రైళ్లను ట్రాక్‌లపైకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రతీ ఏటా 800 కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. దీన్ని 1,000 కోట్లకు పెంచాలనేది ఈ ప్రణాళికలో భాగంగా చెప్తున్నారు.

మరోవైపు రైళ్ల ప్రయాణ సమయాన్ని కూడా తగ్గించడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మరిన్ని ట్రాక్‌లు వేయడం, వేగాన్ని పెంచడం, వంటి చర్యలు తీసుకోనున్నారు. ఫుష్ పుల్ టెక్నిక్ వాడటం ద్వారా రైళ్లు ఆగిన తర్వాత తిరిగి వేగం పుంజుకునేలా చేయబోతున్నారు. అలాగే ఏటా కొత్తగా తయారయ్యే దాదాపు 225 రైళ్లలో పుష్ పుల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే రైల్వేలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందే భారత్ సర్వీసుల యాక్సిలరేషన్, డీసీలరేషన్ సామర్థ్యం ప్రస్తుత రైళ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండేలా చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+