Indian railway: రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఏదో తెలుసా..? అవును, ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం
Sikkim: దేశంలో సామాన్యుడు మొదలుకొని ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించే ప్రయాణ సాధనం రైలు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ దూరాలకు ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. దీంతో దేశం మొత్తాన్ని కవర్ చేసే విధంగా భారతీయ రైల్వే తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. బుల్లెట్ రైళ్లు ప్రవేశపెడుతూ ప్రపంచంతో పోటీపడుతున్న ఇండియాలో ఇప్పటికీ రైల్వే స్టేషన్ లేని రాష్ట్రం ఒకటి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.
హిమాలయాల పర్వతాల ఒడిలో ఓలలాడుతూ, ప్రకృతి సౌందర్యానికి నెలవైన రాష్ట్రం సిక్కిం. ఎంతో మంది పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తూ ప్రకృతి ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టడంతో తనకు తానే సాటి. ఎల్లప్పుడూ టూరిస్టులు, పర్వతారోహకులతో నిత్యం కిటకిటలాడుతూ ఉండే ఈ రాష్ట్రపు భౌగోళిక సవాళ్ల వల్ల భారతీయ రైల్వే తన నెట్‌వర్క్‌ను సిక్కింలో విస్తరించలేకపోయింది.

పర్వతాలు, లోయలతో ఇరుకైన మార్గాలు ఎక్కువగా ఉండటంతో అక్కడ రైల్వే ట్రాక్‌లు నిర్మించడం కష్టతరమవుతుంది. వీటికితోడు వర్షాకాలంలో మరో క్లిష్టమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. తరచుగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో మౌలిక సదుపాయాలకు ఎప్పుడు నష్టం కలుగుతుందో అంచనా వేయడం కష్టతరం.
ఈ కారణాల వల్ల ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తూ, పర్యాటకానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ ఇండియన్ రైల్వే సాహసం చేయలేకపోయింది. అయితే ఆధనిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో ఇప్పుడు అక్కడ రైల్వే లైన్ వేయడానికి అడుగులు పడ్డాయి. కొత్త రంగ్‌పోలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి ప్రధాని మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు. అక్కడ ఈ రకమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా పర్యాటకంతో పాటు దేశ రక్షణ ప్రయోజనాలను కూడా పొందవచ్చని కేంద్రం భావిస్తోంది.












Click it and Unblock the Notifications