బీచుల్లో న్యూడిటీకీ ఇండియన్స్ 'సై'..

మారుతున్న కాలంతో పాటే మనుషుల ఆలోచనల్లోను మార్పులు రావడవం సహజం. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త పక్కకు తప్పుకుని సేద తీరడంలోను ఆధునిక మానవుడు బోల్డ్ నెస్ ను ఇష్టపడుతున్నాడు. సముద్ర తీరాన.. న్యూడ్ గా కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదించడం పట్ల ఈ కాలం యువత మక్కువ చూపుతున్నట్టుగా ఓ లేటేస్ట్ సర్వే రిపోర్ట్.

బీచుల్లో యువత సరదా కాలక్షేపాలకు ఇంటర్నెట్, నైట్ లైఫ్, న్యూడిటీ.. ఈ మూడు ట్యాగ్ లైన్స్ గా మారిపోయాయి. ప్రఖ్యాత ట్రావెల్ పోర్టల్ ఎక్స్ పీడియా ద్వారా ఈ తాజా రిపోర్ట్ వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో పర్యటించి 12 వేల మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు.

indians enjoying internet, nudity, night life in beaches

నివేదిక వెల్లడించిన అంశాల ప్రకారం.. ప్రపంచంలో బీచ్ టూర్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వారిలో థాయ్ లాండ్ దేశస్తులు 82 శాతంతో టాప్ లో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఇండియన్స్ ఉండడం గమనార్హం. నివేదిక చెప్తున్న దాని ప్రకారం 81 శాతం మంది ఇండియన్స్ బీచ్ టూర్స్ అంటే ఇష్టపడుతున్నారట.
ఇందులో 39 శాతం మంది నైట్ లైఫ్ ఎంజాయ్ మెంట్ ఉండే ప్రాంతాలనే ఎంచుకుమంటాని చెప్పగా, 24 శాతం మంది ఇండియన్స్ బీచుల్లో న్యూడిటీని ఎంజాయ్ చేస్తామని చెప్పారు.

ఇక ఎంత టూర్ బిజీలో ఉన్నా.. ఇంటర్నెట్ ద్వారా ఆఫీసుల పనులు చక్కదిద్దుకోవడంలోను ఇండియన్స్ ముందుంటున్నారు. ట్రావెల్ పోర్టల్ రిపోర్ట్ సర్వే కూడా ఇదే విషయాన్ని బయటపెట్టింది. టూర్స్ కి వెళ్లే ప్రతి నలుగురు ఇండియన్స్ లో ఒకరు టూరింగ్ స్పాట్స్ లోను ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని ఆఫీసు
ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవడం, ఇంటర్నెట్ కోసం ట్యాబ్ ను ఎప్పుడూ వెంటపెట్టుకుంటున్నారట.

ఇంకా ఆసక్తిని కలిగించే విషయమేంటంటే బీచుల్లోను వైఫై ని అందుబాటులోకి తీసుకురావాలని, దాంతో ఎప్పటికప్పుడు తమ టూర్ వివరాలు స్టేటస్ లో అప్ లోడ్ చేసుకోవడానికి, అలాగే ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసే వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు ఇండియన్స్ టూరిస్టులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+