పాకిస్థాన్‌ను పొగిడేవారిని బూట్లతో కొట్టి, తరిమేయాలి: సాధ్వి
మంగళూరు: భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్‌ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టాలని, అక్కడికే పంపాలని విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి బాలికా సరస్వతీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అలా మాట్లాడేవారిని అక్కడికే తరిమికొట్టాలని, ఏమాత్రం సహించకూడదని చెప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సాద్వి బాలిక సరస్వతీ మార్చి 1న మంగళూరులో హిందూ సమాజోత్సవ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు.
దేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటూ పరాయి దేశం పాక్‌ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టి.. అక్కడికే తరిమేయాలన్నారు. ఇలాంటివాటిని సహిచంబోమని, దెబ్బకు దెబ్బకు తీయాల్సిందేనని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని అన్నారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లోనూ ఒక రామమందిరం నిర్మించాలని, అక్కడికి కూడా వెళ్లి మనమంతా పూజలు నిర్వహించాలంటూ వ్యాఖ్యానించారు.

భారత్ స్వాతంత్ర్యాన్ని శాంతియుతంగా పొందిందని చరిత్ర చెప్పొచ్చుగానీ, మీ స్వాతంత్ర్యం మాత్రం శాంతియుతంగా లేదంటూ పాక్‌ను ఉద్దేశించి అన్నారు. మనందరం ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం వచ్చిందని సభనుద్దేశించి అన్నారు.
కాగా, ఈ వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు, ఆమెపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. సుమోటోగా స్వీకరించి మేమే చర్యలు తీసుకోవచ్చా అనే దిశగా ఆలోచన చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications