వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజూ 30 ఫ్లైట్ల బ్యాన్ ..? కొనసాగుతోన్న ఇండిగో విమానాల నిలిపివేత

|
Google Oneindia TeluguNews

ముంబై : బడ్జెట్ ఫ్రెండ్లీ విమానయాన సంస్థ .. ఇండిగో తమ విమాన సేవలను నిలిపివేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పైలట్లు లేరని, పొగ మంచు కురుస్తోందని కారణాలు చూపుతూ రోజు కనీసం 30 విమానాలను రద్దుచేస్తోంది. ఫ్లైట్ల రద్దుతో ప్రయాణాన్ని వాయిదా వేసుకోలేని ప్యాసెంజర్ .. మరో టికెట్ బుక్ చేసుకుంటున్నారు. అప్పటికప్పుడు టికెట్ బుక్ చేయడంతో చార్జీ ఎక్కువ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిబ్బంది కొరతే కారణమా ..?
సోమవారం, మంగళవారం రద్దుచేసిన విమానాలే కాక ఈ ప్రక్రియ రోజు కొనసాగుతోందని ఇండిగో ప్రకటించింది. దీంతో దేశంలో వివిధ నగరాలకు తక్కువ ఛార్జీతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఇండిగో సంస్థకు ఏమైంది అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి తమకు పైలట్లు లేరని ఆ సంస్థ సెలవిస్తోంది. సిబ్బంది కొరత వల్లే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామని చెపుతోంది. విమాన పైలట్లు ఏడాదికి వెయ్యి గంటలు మాత్రమే పనిచేయాలని .. తమ సిబ్బంది దాన్ని అధిగమించారని పేర్కొంది. మరోవైపు ఢిల్లీలో వాతావరణం సరిగా లేనందున సర్వీసులను రద్దుచేసినట్టు స్పష్టంచేసింది. ఉత్తర భారతదేశంలో మంచు కురుస్తోన్నందు వల్ల సోమవారం 11 ఇండిగో విమానాలను దారి మళ్లించామని ఇండిగో వర్గాలు తెలిపాయి.

IndiGo Cancel 30 Flights.. Will Continue Cancellations Some More Days

కొనసాగుతోన్న విమాన సర్వీసుల రద్దు ..
సోమవారం నుంచి ఇండిగో విమాన సర్వీసుల రద్దు ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 30 ప్లైట్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో 6, చెన్నైలో 8, జైపూర్ లో 3 సర్వీసులను ఆకస్మికంగా రద్దుచేశారు. ఆ మరుసటి రోజు మంగళవారం కూడా 30 విమానాలను బ్యాన్ చేశారు. కోల్ కతా నుంచి 8, హైదరాబాద్ 5, బెంగళూరు, చెన్నైల నుంచి 5 విమానాల చొప్పున సర్వీసులు రద్దయ్యాయి. అయితే ఇలా అర్ధంతరంగా రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరి నిమిషంలో అధిక ధరలకు మరో విమాన టికెట్‌ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. గత శనివారం నుంచి పైలట్ల కొరత వల్ల విమాన సేవలను ఇండిగో నిలిపివేస్తోంది.

విమాన సేవల అంతరాయంపై ఇండిగో స్పందిస్తూ .. మరికొద్దిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. అప్పటివరకు రోజు కొన్ని విమాన సేవల నిలిపివేత ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేసింది. ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో ఈ సమస్యను డీజీసీఏ పరిశీలిస్తోందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

English summary
Shortage of pilots continued to hamper operations of IndiGo with the budget carrier Tuesday cancelling as many as 30 flights from across major airports and passengers allegedly being forced to buy last minute tickets at high fares, a source said. The airline said flight cancellations will continue for some more days, affecting around 30 flights per day. On Monday also, the airline had pulled out 32 flights from its network at short notice inconveniencing tens of hundreds of passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X