IndiGo Offer: ఇండిగో బాధితులకు బంపర్ ఆఫర్..! ఎవరు అర్హులంటే ?

ఇండిగో సంస్ధలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇందులో కొందరు సాధారణ ఇబ్బందులు పడగా.. మరికొందరు మాత్రం తీవ్ర ఇబ్బందులపాలయ్యారు.

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్ లైన్స్ అయిన ఇండిగో సంస్థలో తలెత్తిన సంక్షోభం కారణంగా వారం రోజుల పాటు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీన్ని సరిచేసేందుకు ఇండిగో ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. ఆ తర్వాత క్రమంగా అదే సద్దుమణిగింది. దీంతో తిరిగి ఇండిగో విమానాలు ఎగురుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇండిగో సంస్థ తమ ప్రయాణికులకు ఇప్పటికే రిఫండ్స్ ఇచ్చింది. దీనికి అదనంగా మరో ఆఫర్ ఇస్తోంది.

ఇండిగో సంస్ధలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇందులో కొందరు సాధారణ ఇబ్బందులు పడగా.. మరికొందరు మాత్రం తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. దీంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు ఊరటనిచ్చేలా ఇండిగో తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దుతో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు అదనంగా రూ.10,000 ట్రావెల్ వోచర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది.

IndiGo Offers Further Relief Extra Travel Vouchers for Severely Impacted Fliers

అయితే ఈ వోచర్లు డిసెంబర్ 3-5 మధ్య ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తాయి. అవి ప్రభుత్వం తరఫున ఇచ్చే తప్పనిసరి పరిహారానికి అదనమని ఇండిగో స్పష్టం చేసింది. రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను రాబోయే 12 నెలల పాటు ఏ ఇండిగో ప్రయాణానికైనా ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. తమ కస్టమర్‌లలో కొందరు గంటల తరబడి ఎయిర్‌పోర్టులలో చిక్కుకుపోయారని అంగీకరించిన ఇండిగో.. అందుకు పరిహారంగా ఈ ఓచర్లు అందిస్తామని తెలిపింది.

IndiGo Offers Further Relief Extra Travel Vouchers for Severely Impacted Fliers

అయితే ఇండిగో ఇలా తీవ్రంగా ప్రభావితమైన వారిని ఎలా గుర్తిస్తుందో ఇంకా వెల్లడించలేదు. ఈ సంక్షోభం సంస్థకు పెద్ద సవాలుగా మారింది. దీంతో ప్రయాణికులు చేజారిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 24 గంటలలోపు రద్దయిన విమానాలకు బ్లాక్ టైమ్ ఆధారంగా ₹5,000 నుండి ₹10,000 వరకు పరిహారం అందిస్తామని ఇండిగో ప్రకటించింది. విమానం పార్కింగ్ నుండి బయలుదేరి ఆపరేషన్‌లో ఉన్న సమయాన్నే బ్లాక్ టైమ్ అంటారు. ఇది విమాన సమయబద్ధతకు కీలకంగా భావిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+