ఇండిగో సమ్మర్ స్పెషల్ సేల్ ఆఫర్: రూ.899కే టికెట్
చెన్నై: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో 'సమ్మర్ స్పెషల్ సేల్' ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.899లకే టికెట్ పొందవచ్చు. దేశీయంగా నడిచే ఇండిగో విమానాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. మే 8 నుంచి మే 10వ తేదీ వరకూ ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్లు బుక్‌చేసుకోవచ్చని ఇండిగో తెలిపింది.
ఈ మూడు రోజుల్లో ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకుని ఈ వేసవిని ఎంజాయ్ చేయాలని ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ అన్నారు. ప్రయాణికులను సంతోష పెట్టేందుకే ఈ ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

కాగా, ముంబై-గోవా, అహ్మదాబాద్- ముంబై, చెన్నై-పోర్ట్ బ్లెయిర్, గౌహతి- హైదరాబాద్, ముంబై-గౌహతి, జమ్మూ-అమృత్‌సర్, ఢిల్లీ-ఉదయ్‌పూర్, కోల్‌కతా-అగర్తలా తదితర రూట్లలో ఇండిగో ఈ సదుపాయాన్ని కల్పించింది.
టికెట్లు బుక్ చేసుకున్న వారు జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. కాగా, చెన్నై నుంచి 14 మార్గాలకు ప్రత్యేక ధరలను కూడా ప్రకటించింది. వీటిలో హైదరాబాద్‌కు రూ.1,399, విశాఖపట్నానికి రూ.1,099లకే టికెట్ అందించనున్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications