బాలి టూ భారత్: మాఫియా డాన్ ఛోటా రాజన్
బాలి: మాఫియా డాన్ ఛోటా రాజన్ ను భారత్ తీసుకువస్తున్నారు. ఇండోనేషియాలోని బాలి పోలీసుల అదుపులో ఉన్న ఛోటా రాజన్ ను భారత్ సీబీఐ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఛోటా రాజన్ తో బాలి విమానాశ్రయం చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై నగరాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్విక్ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దింపారు. మొదట ఛోటా రాజన్ ను ఢిల్లీకి తీసుకుస్తున్నారు. అక్కడ సీబీఐ సీనియర్ అధికారులు ఛోటా రాజన్ ను విచారించనున్నారు.

దావూద్ ఇబ్రహీం సమాచారం, అండర్ వరల్డ్ మాఫియా కార్యకలాపాలు గురించి పూర్తి వివరాలు సేకరించనున్నారు. తరువాత ఛోటా రాజన్ ను ముంబై పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఛోటా రాజన్ ను భారత్ కు ఎప్పుడు తీసుకు వస్తారు అని విలేకరులు న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ప్రశ్నించారు. త్వరలోనే అతడు భారత్ లో ఉంటాడని రాజ్ నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. గురువారం రాత్రి లోపు ఛోటా రాజన్ ను భారత్ తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications