భర్తను పిస్టల్‌తో కాల్చి చంపిన భార్యకు జీవిత ఖైదు

తన చెల్లెలిని చెడు ఉద్దేశ్యంతో చూశాడన్న ఆరోపణతో భర్తను పిస్టల్‌తో కాల్చి చంపిందని తెలిపింది. మార్చి 2013లో ఈ ఘటన జరిగింది. నజియా బాధితుడికి రెండవ భార్య. భర్త నిద్రపోతున్న సమయంలో ఇంటి తలుపుకి గడియపెట్టి అతని తలపై కాల్చింది.
పిస్టల్ సౌండ్ విన్న చుట్టు పక్కల వాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడి తలుపులు బద్దలు కొట్టి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆతను మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు నజియాను అరెస్టు చేసి బాధితుడిని చంపేందుకు వాడిని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణలో తన భర్త చెల్లెలతో చెడుగా ప్రవర్తించడం వల్లనే కాల్చి చంపానట్లు వెల్లడైందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications