ఇండస్ట్రియల్ పాలసీలో దేశానికే ఆదర్శం.. తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి : కేటీఆర్
ఢిల్లీ : తెలంగాణ అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధిస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్. ఐదేళ్ల కిందట టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా ఇప్పటికే 11 వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఆ మేరకు 8 వేలకు పైగా ఇండస్ట్రీల్లో దాదాపు 12 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందని చెప్పారు. ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొన్నారు కేటీఆర్.

తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి
గత ఐదేళ్లుగా తెలంగాణ అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధించిందని చెప్పుకొచ్చారు కేటీఆర్. మేఘాలయ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన యూనియన్ ఆఫ్ స్టేట్స్ సెషన్‌లో ఆర్థిక ప్రగతి సాధించేందుకు దోహద పడే కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రొగ్రెసివ్ లీడర్ షిప్ ద్వారా రాష్ట్రాలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతుందని.. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రం పెద్ద ఉదాహరణ అని వెల్లడించారు.

టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా అనుమతులు ఈజీ
ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత టీఎస్ ఐపాస్ చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు ఇవ్వడం ద్వారా పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందని వివరించారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు పెరిగినట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు.

ఎకానమిక్ విజన్ కోసం కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి
అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకెళ్లినప్పుడే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు కేటీఆర్. ముక్యంగా ఎకనామిక్ విజన్ కోసం పనిచేసినప్పుడే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని తెలిపారు. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే ఆర్థిక అభివృద్ధి మరింత స్పీడప్ అవుతుందన్న కేటీఆర్.. తెలంగాణలో అధికార వికేంద్రీకరణ స్పూర్తి బలంగా ఉందన్నారు. అందుకే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పది జిల్లాల నుంచి 33 జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా అనేక గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆ విషయంలో కేంద్రం నిబంధనలు సడలిస్తే బాగుండు..!
పట్టణల్లో మౌలిక వసతులు కల్పించడానికి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు కేటీఆర్. అయితే కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో స్వేచ్ఛగా ఆయా సంస్థలు రాష్ట్రాల్లోకి వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందించాలని ఆకాంక్షించారు. ఈ అంశంలో కేంద్రం నిబంధనలు సడలించి ఆయా రాష్ట్రాలకు సహాయకారిగా నిలవాలని కోరారు. అదలావుంటే ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications