అజ్ఞాతంలో టీటీవీ దినకరన్: శశికళ గ్రూప్ ను వదలద్దు, పట్టుకోండి, ఎస్కేప్ !
ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ అరెస్టు భయంతో చెన్నైలో అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. శశికళ వర్గం ఆందోళనతో హడలిపోతున్నారు.
న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు పరిస్థితులు అనుకూలించడం లేదని స్పష్టంగా కనపడుతోంది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి తమిళనాడు సీఎం పగ్గాలు చేపట్టాలకున్న దినకరన్ కు ఇప్పుడు కష్టకాలం మొదలైయ్యింది.
అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం చేతికి దక్కించుకోవడానికి ఏకంగా ఎన్నికల కమిషన్ కే లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు అరెస్టు భయంతో చెన్నైలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

లంచం ఇవ్వాలని స్కెచ్
ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇచ్చి రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవాలని టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వాలని, అందుకోసం సరైన వ్యక్తుల కోసం దినకరన్ గాలించారు. అయితే అనుకున్న ప్లాన్ రివర్స్ కావడంతో దినకర్ ఇప్పుడు కష్టాల్లో పడ్డాడు.

ఆయన్ను నమ్మి అష్టకష్టాలు
ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త సుఘేష్ చంద్రతో దినకరన్ సంప్రదింపులు జరిపారు. ఎన్నికల కమిషన్ కు లంచం ఇచ్చి మీ పని పూర్తి చేస్తానని సుఘేష్ చంద్ర టీటీవీ దినకరన్ కు హామి ఇచ్చారు. సోమవారం ఉదయం నగదుతో ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకి వెలుతున్న పారిశ్రామికవేత్త సుఘేష్ చంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దినకరన్ ఇచ్చారని స్టేట్ మెంట్ ఇచ్చాడు
ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వాలని తనకు నగదు టీటీవీ దినకరన్ ఇచ్చారని పారిశ్రామివేత్త సుఘేష్ చంద్ర స్వయంగా పోలీసుల ముందు అంగీకరించారు. ఇప్పుడు టీటీవీ దినకరన్ పరిస్థితి అతిదారుణంగా తయారైయ్యింది. తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న దినకరన్ కు ఇప్పుడు సినిమా కష్టాలు మొదలైనాయి.

మాయం అయిన దినకరన్
ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తన మీద కేసు నమోదు చేశారని తెలుసుకున్న టీటీవీ దినకరన్ సోమవారం ఉదయం చెన్నైలో ఉన్నట్టుండి మాయం అయ్యారు. పోలీసులు ఎప్పుడు ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో టీటీవీ దినకరన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

పన్నీర్ సెల్వం వర్గీయులు
అన్నాడీఎంకే పార్టీ రెండుకుల చిహ్నం కోసం పోటీ పడుతున్న పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకులు శశికళ కుటుంబ సభ్యుల తీరుపై మండిపడుతున్నారు. పదవుల కోసం శశికళ వర్గం ఎంతకైనా తెగిస్తారని ఇప్పుడు మరోసారి రుజువైయ్యిందని విరుచుకుపడుతున్నారు.

ఢిల్లీలో పరువుపోయింది
తమిళనాడు రాష్ట్ర పరువును ఢిల్లీలో తాకట్టుపెట్టడానికి దినకరన్ ప్రయత్నించారని, ఏకంగా ఎన్నికల కమిషన్ కే లంచం ఇవ్వడానికి ప్రయత్నించి రాష్ట్రం పరువు తీశారని పన్నీర్ సెల్వం వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ఏం చెద్దాం అంటున్న చిన్నమ్మ వర్గీయులు
టీటీవీ దినకరన్ మీద ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు అని తెలుసుకున్న వెంటనే ఆయన అనుచరులు మాయం అయ్యారు. దినకరన్ చిక్కకపోతే మమ్మల్ని ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో దినకరన్ అనుచరులు హడలిపోతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications