వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

INDvPAK: భారత్‌ను గెలిపించిన చివరి ఓవర్ నాలుగో బంతిపై సోషల్ మీడియాలో చర్చ ఎందుకు జరుగుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్ స్టేడియంలో ఆదివారం నాడు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఒక దశలో భారత్ చేయిదాటి పోయిందనుకున్న మ్యాచ్ అనూహ్యంగా టర్న్ తీసుకుంది. దీనికి కారణంగా చివరి ఓవర్‌లో నాలుగో బంతి.

అసలుసిసలైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లా ప్రేక్షకులను, క్రీడాభిమానులను ఈ మ్యాచ్ కట్టిపడేసినప్పటికీ, చివరి ఓవర్ నాలుగో బంతి మీద చర్చ, ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తోంది.

న్యూస్ కార్ప్ డిజిటల్ ఏఎఫ్ఎల్ టీమ్ హెడ్ అల్ పాటన్ ఆఖరి ఓవర్ బంతులను ఇలా వివరించారు.

https://twitter.com/al_superfooty/status/1584156294767706112

చివరి ఓవర్ నాలుగో బంతి కథేంటి?

మెల్‌బోర్న్ మ్యాచ్‌లో మహమ్మద్ నవాజ్ చివరి ఓవర్‌ వేస్తున్నాడు. ఈ నాలుగో బంతి విసిరినప్పుడు విరాట్ కోహ్లీ దాన్ని సిక్సర్ కొట్టాడు. అయితే, అంపైర్ దాన్ని నోబాల్ ‌గా ప్రకటించాడు. కారణం, ఆ బంతి విరాట్ కోహ్లీ నడుము పై భాగం వరకు వచ్చింది.

బౌలర్ విసిరిన బంతి బ్యాట్స్‌మన్ నడుముపై వరకు వచ్చినట్లు అంపైర్ గుర్తిస్తే, దాన్ని నోబాల్ గా ప్రకటిస్తాడు. బ్యాటర్‌కు ఫ్రీ హిట్‌కు అవకాశమిస్తాడు.

అయితే, ఫ్రీ హిట్ కోసం విసిరిన బంతి వైడ్ అయ్యింది. దీంతో నవాజ్ మళ్లీ నాలుగో బంతిని విసిరాడు. దీనికి విరాట్ బౌల్డ్ అయ్యాడు. అయితే బంతి స్టంప్‌లను తాకి, థర్డ్ మ్యాన్ దిశలో వెళ్లింది. ఈ సమయంలో కోహ్లీ, కార్తీక్‌లు మూడు పరుగులు తీశారు.

దీనిపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంపైర్‌తో మాట్లాడాడు. కానీ, అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

దీంతో అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయమే మ్యాచ్‌ను మలుపు తిప్పిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

షోయబ్ అక్తర్ ఏమన్నాడు?

దీనిపై స్పందించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, ''అంపైర్ సోదరులారా, ఈ నిర్ణయంపై ఈ రాత్రి మీరు ఆలోచించండి’’ అంటూ ట్విటర్‌లో కామెంట్ పెట్టాడు.

మరో ట్వీట్‌లో ''నిజంగా ఇది దురదృష్టకరం. ఇది టైట్ మ్యాచ్. ఇలాంటి మ్యాచ్‌లు ఈ రెండు జట్లను అత్యంత ప్రత్యర్థులుగా మారుస్తాయి'' అని వ్యాఖ్యానించాడు.

పాకిస్తాన్ కు చెందిన ఓ క్రీడాభిమాని కూడా ఈ బాల్‌ను నోబాల్‌గా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.

''బంతి కోహ్లీ నడుముకు కొద్దిగా పైకి వెళ్లింది. కానీ, కోహ్లీ అప్పటికి క్రీజు దాటి బయటకు వచ్చాడు. అతను క్రీజ్‌లో ఉన్నట్లయితే అది రైట్ బాల్ అయ్యేది. దురదృష్టవశాత్తు అంపైర్ దాన్ని రివ్యూ చేయలేదు'' అని వ్యాఖ్యానించాడు.

https://twitter.com/mbk_1013/status/1584155951736975360

తర్వాత అదే యూజర్ మరో ట్వీట్‌లో, పాకిస్తాన్ జట్టు నాలుగో ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం ఇవ్వడం గురించి కూడా రాశాడు.

''అది నోబాల్ అయినా, కాకున్నా ఈ మ్యాచ్ మనం గెలిచి ఉండాల్సింది. 15 ఓవర్ లోపు ఇద్దరు స్పిన్నర్‌లతో బౌలింగ్ చేయించకపోయినట్లయితే, బ్యాట్స్‌మన్‌కు బదులుగా నాలుగో పేసర్‌తో బౌలింగ్ చేయించాల్సింది. నిజంగా ఇవాళ్టి మ్యాచ్‌ను మిస్సయ్యాం'' అని రాసుకొచ్చాడు.

https://twitter.com/mbk_1013/status/1584160646286913536

పాకిస్తాన్‌కు చెందిన మరో అభిమాని ఈ చర్చను భిన్నమైన కోణంలో సాగించాడు.

''నో బాల్ అవుతుందా కాదా అన్నది అర్ధం లేని చర్చ. మనం చాలా చోట్ల పొరపాట్లు చేశాం. ఇద్దరు ప్రమాదకరమైన ఆటగాళ్ల మధ్య అంటే కోహ్లీ, పాండ్యాల 100 పరుగుల భాగస్వామ్యాన్ని చెదరగొట్టాల్సింది. నాలుగో బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసిన తర్వాత చాలా నిర్లక్ష్యంగా ఆడారు. దాన్ని మనం ఒప్పుకోవాలి'' అని రాశాడు.

పాకిస్తాన్ ఆటగాడు అబ్బాస్ అలీ తన ట్వీట్‌లో ఇలా రాశాడు, "నవాజ్ చివరి ఓవర్ మొదటి బంతితో మ్యాచ్ గెలిచాడు. రెండవ, మూడవ, నాల్గవ బంతులతో మ్యాచ్‌ను ఓడిపోయాడు. మళ్లీ అయిదో బంతికి మ్యాచ్ గెలిచాడు. కానీ, చివరి బంతితో మ్యాచ్ మొత్తం పోయింది. వాట్ ఏ గేమ్'' అంటూ ట్వీట్ చేశాడు.

https://twitter.com/anwershah17/status/1584152542216609794

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ముగ్గురు బౌలర్లతోనే ఆడటంపై పలువురు క్రికెట్ అభిమానులు ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు దీనిని 'నేరం' అని కూడా పేర్కొన్నారు.

ఆఖరి ఓవర్ గురించి ఒక పాకిస్తాన్ అభిమాని ఇలా రాశాడు, "1 నో బాల్, 2 వైడ్...క్రిమినల్...నాల్గవ ఫాస్ట్ బౌలర్ కావాలి..."

https://twitter.com/m_shotcaller/status/1584151681477943296

20వ ఓవర్ వేసిన స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ మహ్మద్ జీషాన్ ఆసిఫ్ అనే పాకిస్తాన్ క్రికెట్ అభిమని "నవాజ్ పట్ల మాకు సానుభూతి ఉంది. అతను చివరి ఓవర్ వేయాల్సి వచ్చింది. మా జట్టులో నాల్గవ పేసర్ కొరత ఉంది, లేకుంటే ఈ మ్యాచ్ ఇంత క్లోజ్‌గా వెళ్లేది కాదు'' అని రాశారు.

చివరి ఓవర్ నాలుగో బంతిని గురించి రాస్తూ '' అది నోబాల్ కాదు. అంపైర్ పక్షపాతంతో తీసుకున్న నిర్ణయం'' అని విమర్శించాడు.

https://twitter.com/Zeshu_tweets/status/1584154054955237381

పాకిస్తాన్ అభిమానులు

అదే సమయంలో, ఈ మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని స్టేడియంలోని భారత అభిమానులు ఆస్వాదించడం కనిపించింది. జాన్ అనే అభిమాని మ్యాచ్ గెలిచిన తర్వాత మెల్‌బోర్న్ గ్రౌండ్ వీడియోను షేర్ చేశాడు. (వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి)

https://twitter.com/CricCrazyJohns/status/1584167465881579523

మరో ట్వీట్‌లో, సునీల్ గావస్కర్ ఆనందంతో గంతులు వేస్తున్న దృశ్యాలను కూడా అతను ట్వీట్ చేశాడు. ఆ క్షణాలను గోల్డెన్ మూమెంట్స్ గా అభివర్ణించాడు. (వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి)

https://twitter.com/CricCrazyJohns/status/1584175458895417344

వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో 'పాకిస్తాన్ ఓటమి'పై కామెంట్లు చేశారు. ట్వీట్‌లో ఖాళీలను మీరే పూరించుకోండి అంటూ ట్వీట్ చేశాడు.

https://twitter.com/virendersehwag/status/1584157716037394433

ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా ట్వీట్ చేస్తూ, మీరు విజయాన్ని ఆస్వాదించే ముందు, వైడ్ బాల్‌ను జాగ్రత్తగా వదిలేసిన అశ్విన్ ప్రశాంతమైన ఆట గురించి కూడా ఆలోచించండి'' రాశారు.

https://twitter.com/bhogleharsha/status/1584160495510392833

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
INDvPAK: Why is there a debate on social media about the fourth ball of the last over that won India?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X