లేడీ టెక్కీ హత్య: ఇన్ఫోసిస్ ఏం చెప్పిందంటే !
పూణేలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో ఆదివారం సాయంత్రం హత్యకు గురైన మహిళా టెక్కీ అనంద కె. రసిలా రాజు (25) హత్యకు సంబంధించి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సంతాపం వ్యక్తం చేసింది.
పూణే/బెంగళూరు: పూణేలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో ఆదివారం సాయంత్రం హత్యకు గురైన మహిళా టెక్కీ అనంద కె. రసిలా రాజు (25) హత్యకు సంబంధించి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సంతాపం వ్యక్తం చేసింది.

రసిలా రాజు హత్య మా సంస్థకు తీరనిలోటు అని, తామ కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయామని ఇన్ఫోసిస్ ట్వీట్టర్ లో విషాదం వ్యక్తం చేసింది. మా సంస్థ ఉద్యోగి కుటుంబ సభ్యుల ఆక్రందన విన్నాం, వారికి మా ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నామని ఇన్ఫోసిస్ తెలిపింది.
రసిలా రాజు హత్య కేసుకు సంబంధించి ఎలాంటి దర్యాప్తుకైనా పూణే పోలీసు అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. రసిలా రాజుకు సంస్థ తరపున సంతాపం వ్యక్తం చేసింది.
(1/2) We are deeply saddened & shocked by the tragedy at Pune DC. Our hearts go out to our colleague’s family in this time of grief.
— Infosys (@Infosys) January 30, 2017
(2/2) We are working with the authorities to provide all necessary support.
— Infosys (@Infosys) January 30, 2017












Click it and Unblock the Notifications