డిప్యూటీ సీఎంపై ఇంకు దాడి: ఎల్‌జీ ఆఫీసు ముందు ఘటన
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి ఇంకు దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆఫీసు బయట ఈ దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే... ఇటీవల కాలంలో ఢిల్లీ ప్రజలు చికెన్ గున్యా వ్యాధితో తీవ్రంగా భయపడుతున్నారు.

అంతేకాదు ఈ వ్యాధి వల్ల పలువురు ఇప్పటికే మరణించారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎంను వెంటనే ఢిల్లీకి తిరిగిరావాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. ఈ క్రమంలో సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవడానికి వెళ్లిన సమయంలో ఆయనపై ఇంకు దాడి జరిగింది.
డిప్యూటీ సీఎంపై ఇంకు దాడికి పాల్పడిన వ్యక్తిని ఢిల్లీలోని కారావాల్ నగర్‌కు చెందిన బ్రజేష్ శుక్లాగా పోలీసులు గుర్తించారు. 'ఢిల్లీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ప్రజల సొమ్ముతో సిసోడియా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు' అంటూ ఇంకు దాడి చేసే సమయంలో శుక్లా ఆగ్రహంతో రెచ్చిపోయాడు. శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#WATCH: Man throws Ink at Manish Sisodia in Delhi, says Sisodia goes abroad but people of Delhi are left suffering. pic.twitter.com/0T9fUvoGk5
— ANI (@ANI_news) September 19, 2016
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications