అబూ సలేం మొబైల్ పెళ్లిపై విచారణ: ఢిల్లీకి పోలీసులు
న్యూఢిల్లీ: గ్యాంగస్టర్ అబు సలేం ఫోన్‌లో ముంబై అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే వార్తలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ముంబై పోలీసు బృదం బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకుంది. కోర్టు విచారణ కోసం పోలీసు ఎస్కార్టుతో లక్నోకు తీసుకుని వెళ్తుండగా సలేం రైలులో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ రోజు అబూ సలేంను ఉంచిని కోర్టు ఆవరణలోని లాకప్ వద్ద విధులు నిర్వహించిన పోలీసులను ముంబై పోలీసు బృందం ప్రశ్నించింది. కోర్టులో అబూ సలేం తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎంఎస్ ఖాన్‌ను కూడా వారు విచారించినట్లు తెలుస్తోంది.

అబూ సలేం వివాహం చేసుకున్నట్లు తనకేమీ సమాచారం లేదని, ఆ విషయం సలేం తనతో చెప్పలేదని ఖాన్ పోలీసులకు చెప్పారు. ఇదే విషయంపై విచారించడానికి ముంబై పోలీసులు రేపు గురువారం లక్నో వెళ్లే అవకాశం ఉంది. మీడియా వార్తలను బలపరిచే ఆధారాలేనీ పోలీసులకు ఇప్పటి వరకు చిక్కలేదు.
సలేం పెళ్లి చేసుకున్నట్లు వార్తలపై విచారణ జరిపించాలని ముంబై టాడా కోర్టు థానే పోలీసు కమిషనర్‌ను అదేశించింది. దీంతో విచారణ నిమిత్తం ప్రత్యేకంగా ఓ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. తన అనుమతి లేకుండా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు ఎలా పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నిస్తూ దానిపై విచారణ చేయాలని టాడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications