వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సినిమా ప్రేరణతో వికలాంగ యువకుడిని హత్యచేసి, చోరీ చేసిన మైనర్ బాలుడు.. ఎక్కడంటే!!

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ చలనచిత్రం నుండి ప్రేరణ పొందిన ఒక మైనర్ బాలుడు వికలాంగుడైన ఒక యువకుడిని హతమార్చి, చోరీకి పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో ఒక ఇంట్లో మూడు నెలల క్రితం పనికి చేరిన ఒక మైనర్ బాలుడు, అదే ఇంట్లోని వికలాంగ యువకుడిని హత్య చేసి, పరారైన క్రమంలో 17 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వికలాంగ యువకుడిని చంపి మైనర్ బాలుడి చోరీ

వికలాంగ యువకుడిని చంపి మైనర్ బాలుడి చోరీ

అసలేం జరిగిందంటే.. ఇంట్లోని యజమానులు అయిన భార్య భర్తలు గుడికి వెళ్లారు. ఆ తర్వాత వికలాంగ యువకుడి సోదరి కూడా గ్రీన్ పార్క్ మార్కెట్ కు వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా వికలాంగుడైన యువకుడు ఉన్న క్రమంలో, అతనికి తెలియకుండా ఇంట్లో చోరీ చేయడానికి ప్రయత్నించాడు మైనర్ బాలుడు. అయితే మైనర్ బాలుడు దొంగతనం చేయడాన్ని చూసి వికలాంగ యువకుడు పెద్దగా కేకలు వేయడంతో పదిహేడేళ్ళ మైనర్ బాలుడు యువకుడిని హత్య చేశాడు. బాలుడు బాలీవుడ్ చిత్రం తు చోర్ మెయిన్ సిపాహి నుండి ప్రేరణ పొందాడని పోలీసు అధికారి తెలిపారు.

 హిందీ సినిమా ప్రేరణతో బాలుడి నిర్వాకం

హిందీ సినిమా ప్రేరణతో బాలుడి నిర్వాకం

మైనర్ నిందితుడు కూడా సినిమాలో చూపిన విధంగా బ్లాక్ కలర్ గ్లోవ్స్‌ను స్పాట్‌లో వదిలిపెట్టాడని పోలీసులు తెలిపారు. గుడికి వెళ్లిన తల్లిదండ్రులు లేని సమయంలో బాలుడు దొంగతనం చేయడాన్ని చూసి కేకలు వేయడం తోనే వికలాంగ యువకుడు హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. మార్కెట్ కు వెళ్ళిన సోదరి తిరిగి వచ్చేసరికి, ఆమె తన సోదరుడు అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉండటం మరియు ఇంట్లో పని చేయడానికి పెట్టుకున్న బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు .

నగలు, నగదు చోరీ చేసి పారిపోయే క్రమంలో పట్టుబడ్డ మైనర్ బాలుడు

నగలు, నగదు చోరీ చేసి పారిపోయే క్రమంలో పట్టుబడ్డ మైనర్ బాలుడు

ఇంటిని తనిఖీ చేయగా కొన్ని నగలు, మొబైల్ ఫోన్, సుమారు రూ.40 వేల నగదు కూడా మాయమైనట్లు గుర్తించారు. చోరీ చేసిన బాలుడు బీహార్‌లోని సీతామర్హిలోని తన స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించిన క్రమంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి చోరీకి గురైన నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాలుడిని విచారించిన పోలీసులు మైనర్ బాలుడి చేసిన దారుణానికి గల కారణాలను వివరించారు.

 సినిమాలో చూపించినట్టు చోరీ... చిన్నారుల మనసులపై సినిమాల ప్రభావం

సినిమాలో చూపించినట్టు చోరీ... చిన్నారుల మనసులపై సినిమాల ప్రభావం

మైనర్ బాలుడు క్లీనింగ్ వంటి పనులు చేయడం అవమానంగా భావించి, బయటకు వెళ్లాలని భావించాడని, బయట ఏదైనా పని చేయాలంటే డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు సంపాదించడం కోసం ఇంటిని దోచుకోవాలని ప్లాన్ చేశాడని పేర్కొన్నారు. సినిమా చూసి అలాగే దొంగతనానికి ప్రయత్నం చేశాడని చెప్పారు. అయితే మైనర్ బాలుడు దొంగతనం చేయడాన్ని వికలాంగ యువకుడు చూసి, కేకలు వేయడంతోనే అతడిని హతమార్చి బాలుడు దొంగతనం చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా సినిమాలు చిన్న పిల్లల మనసుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి అన్నది తాజా కేసులో స్పష్టంగా అర్థమవుతుంది.

English summary
Inspired by a Bollywood movie, a minor boy killed a disabled youth and robbed in the national capital, Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X