వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఆదర్శం: స్యేషన్లో ఛాయ్ అమ్మే స్త్రీ విలేజ్ ప్రధాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఛాయ్‌వాలా నుంచి ప్రధాని వరకు ఎదిగిన నరేంద్ర మోడీని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఆదర్శంగా తీసుకుంది. ఆమె గ్రామానికి సర్పంచ్ అయ్యారు. ప్రధాని మోడీ 29 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే.. ఆయనను ఆదర్శంగా తీసుకున్న ఆ మహిళ 16 గ్రామాలకు సర్పంచ్‌గా ఎంపికయ్యారు.

ఉత్తర ప్రదేశ్‌లోని నాగ్లాకరన్ గ్రామానికి చెందిన పూజాకుమారి వృత్తిరీత్యా చాయ్ అమ్ముతుంటుంది. ఇటీవల జరిగిన గ్రామ్ ప్రధాన్ ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది. ఎన్నికల్లో కుమారి 111 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే 65 ఏళ్ల తర్వాత మహిళ సర్పంచ్‌గా ఎన్నిక కావడం ఆమెకే సొంతమైంది.

Inspired by Modi, girl who sells tea at railway station becomes village pradhan

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ్ ప్రధాన్ ఎన్నికల్లో గెలుపొందడం గర్వంగా ఉందని, గెలుపుకు ప్రధాని మోడీయే తనకు ప్రేరణ అని చెప్పింది. ఈ విజయం తన కుటుంబానికి గొప్ప సంతోషాన్నిచ్చిందని, మోడీ ప్రసంగాలను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని తన భర్త మద్ధతుతో విజయం సాధించానంది.

అత్తమామలు ఎప్పటి నుంచో పాటియాలి రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే వారని, తనకు పెళ్లైన తర్వాత తాను కూడా భర్తతో కలిసి టీ అమ్మడం ప్రారంభించానని, ఆ సమయంలో ప్రజలతో పరిచయాలు పెరిగాయని, అప్పుడే ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్నానని, మహిళల అభివృద్ధి కోసం పాటు పడుతానని పేర్కొంది. ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు.

English summary
Inspired by Modi, Woman Tea Seller Becomes the First Pradhan for 16 Villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X