పెద్ద విగ్రహాలు కాదు! ఆర్థిక మందగమనం: మోడీ సర్కారుపై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ప్రధాని కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం కావడం వల్లే దేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.

అధికార కేంద్రీకరణ..

అధికార కేంద్రీకరణ..

మూలధనం, భూమి, కార్మిక మార్కెట్లు, పెట్టుబడులు, వృద్ధిని సరళీకరించేలా సంస్కరణలు అవసరమని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పోటీతత్వం పెంపొందించడం, దేశీయ సమర్థతను మెరుగుపర్చేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో చేరాలని కోరారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరుగుతుందనే దాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలని, ప్రస్తుత ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

కొద్ది మంది నుంచే..

కొద్ది మంది నుంచే..

దేశ ఆర్థిక వృద్ధి మందగమనం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ నిర్ణాయక వ్యవస్థలోనే కాక, సలహాలు ప్రణాళికలు సైతం ప్రధాని చుట్టూ, ప్రధాని కార్యాలయంలో చేరిన కొద్ది మంది నుంచే వస్తున్నాయని రాజన్ తెలిపారు. ఇది పార్టీ రాజకీయ, సామాజిక ఎజెండాకు ఉపకరిస్తున్నా ఆర్థిక సంస్కరణల విషయంలో ఫలితాలను ఇవ్వడం లేదని అన్నారు.

మోడీ సర్కారుకు సూచనలు

మోడీ సర్కారుకు సూచనలు

రాష్ట్రస్థాయిలో కాకుండా దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై వీరికి పెద్దగా అవగాహన ఉండటం లేదని అన్నారు. గత ప్రభుత్వాలు సంకీర్ణాలు అయినా ఆర్థిక సరళీకరణను స్థిరంగా తీసుకెళ్లాయని తెలిపారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఆర్థిక మందగమనాన్ని అధికమించేందుకు ముందు దానిని ప్రణాళికను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఆర్థిక మందగమనం ప్రస్తుతం మాత్రమే అనే ఆలోచన విడనాడాలని రఘురాం రాజన్ సూచించారు. విమర్శలను రాజకీయ కోణంలో చూడకూడదని సరికాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+