EPFO EDLI: ఉద్యోగం చేస్తున్నారా.. ఉచితంగా రూ.7 లక్షల ఇన్సూరెన్స్..!

ప్రీమియం చెల్లిస్తే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కానీ ఉద్యోగం చేసేవారికి ప్రీమియం చెల్లించకున్నా రూ.7 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఇది ఎలాగంటే.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికే ఈ ఇన్సూరెన్స్ అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ప్రతి నెలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO)కు చందా చెల్లిస్తారు. పీఎఫ్ ఉన్న ప్రతి ఉద్యోగి తన బేసిక్ సాలరీలో 12 శాతం చందాగా చెల్లిస్తారు. ఇంతే మొత్తంలో కంపెనీ చెల్లించాలి. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు రెండు పీఎఫ్ లు ఉద్యోగి జీతంలోనే కట్ చేస్తున్నాయి.

ఈ విషయం పక్కన పెడితే.. ఇలా చందా చెల్లించేవారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. దీన్నే ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ స్కీమ్ అంటారు. ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (EDLI)ను 1976లో కేంద్రం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా పీఎఫ్ చందా చెల్లిస్తున్న ఉద్యోగి మరణిస్తే నామినీకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అప్పట్లో ఈ మొత్తంగా తక్కువగా ఉండేది. కొద్ది సంవత్సరాల క్రితం దీన్ని రూ.7 లక్షలకు పెంచారు. ఈడీఎల్ఐ నిబంధనల ప్రకారం యజమాని ఉద్యోగి బేసిక్‌ డీఏలో 0.50% లేదా గరిష్ఠంగా నెలకు రూ.75 చెల్లించాలి.

Insurance of Rs 7 lakh free for employees paying PF subscription

ఈపీఎఫ్‌వో చట్టం వర్తించే అన్ని సంస్థల ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఉద్యోగం చేస్తూ పీఎఫ్ చందా చెల్లిస్తున్న వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే.. నామినీ ఎవరు ఉన్నారో వారికి గరిష్ఠంగా రూ.7 లక్షలు వస్తాయి. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. మరణించిన సభ్యుడు మరణానికి ముందు 12 నెలల పాటు సర్వీసులో ఉండాలి. అలా అయితేనే ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూ 12 నెలలుగా పీఎఫ్ చెల్లిస్తున్న వ్యక్తి చనిపోతే.. క్లైయిమ్ కోసం ఫారం 51F సమర్పించాలి.

మరణించిన ఉద్యోగి మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ సర్టిఫికెట్‌, నామినీ మైనర్ అయితే గార్డియన్‌షిప్‌ సర్టిఫికెట్‌, నామినీ బ్యాంక్ స్టేట్ మెంట్ లేదా క్యాన్సల్ చెక్ అవసరం. ఈపీఎఫ్‌ కమిషనర్‌ క్లైయిమ్‌ స్వీకరించిన 30 రోజులలోపు క్లెయిమ్‌ డబ్బును ఇవ్వాలి.. ఆలస్యం చేస్తే సంవత్సరానికి 12% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ గురించి ప్రతి ఒక ఉద్యోగి తెలుసుకోవడం అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+