Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంజాబ్ లో పైకి ధీమా- లోపల ఒత్తిడి : పోలింగ్ సమీపిస్తున్న వేళ - సొంత వాళ్ళతోనే..!!

పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ రోజుతో ప్రచారం ముగియనుంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఒక ఎత్తయితే...పంజాబ్ లో గెలుపు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఎవరికి వారు విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, లోలోపల మాత్రం టెన్షన్ వెంటాడుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ పట్టు కొనసాగించాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తోంది. కాంగ్రెస్ కు అధికారం దక్కకూడదనే మిషన్ తో బీజేపీ వ్యవహరిస్తోంది.

Recommended Video

    Punjab Elections 2022: పైకి ధీమా..లోపల అంతర్గత సమస్యలు | Election Commission | Oneindia Telugu
    పైకి ధీమాగా కనిపిస్తున్నా

    పైకి ధీమాగా కనిపిస్తున్నా

    రెండు ప్రధాన పార్టీల్లో నెలకొన్న పరిస్థితులనకు తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ఆప్ వ్యూహ రచన చేసింది. అయితే, ప్రచారంలో ఎన్నో హామీలు గుప్పించినా..ఇప్పుడు ఓటర్లు ఎవరితో నిలుస్తారనే ఉత్కంఠ మొదలైంది. అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్దిని మార్చింది. ముఖ్యమం్రి అభ్యర్దిగా చన్నీ ప్రకటన సైతం ఇందులో భాగమే. అయితే, పైకి చన్నీ అభ్యర్దిత్వానికి మద్దతు ఇస్తామని చెబుతూనే..కాంగ్రెస్ తరహా రాజకీయాలకు పంజాబ్ వేదికగా మారుతోంది. అక్కడ ప్రధానంగా చన్నీ - సిద్దూ శిబిరాలు పోలింగ్ సమయంలో ఏ విధంగా సహకరించుకుంటాయా..లేదా అనేది పార్టీ అధినాయకత్వానికి అంతు చిక్కటం లేదు.

    కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలే..వారికి బలంగా

    కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలే..వారికి బలంగా

    ప్రతిపక్ష పార్టీల కంటే పంజాబ్ కాంగ్రెస్ లో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ..అధికార కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు, అసమ్మతుల వల్లే ఎక్కువ నష్టం వాటిల్లే ముప్పుందని చెబుతున్నారు. తాజాగా సిద్దూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. తాను ఇప్పటికే ఇద్దరు-ముగ్గురు సీఎంలను పడగొట్టాను. సరైన దారిలో వెళ్లకపోతే.. మరొకర్నీ గద్దె దింపగల సత్తా ఉందీ అంటూ వ్యాఖ్యానించారు. అంతర్గత వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ.. చన్నీ మాత్రం సంయమనం పాటిస్తున్నారు. బహిరంగంగా ఎక్కడా సిద్ధూకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. పార్టీతో దాదాపు 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకొని మాజీ మంత్రి జోగిందర్‌సింగ్‌ ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో చేరడం, ఎన్నికల ప్రచారంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకుంటుండటంతో చివరి నిమిషంలో పార్టీలో ఆందోళనకు కారణమవుతోంది.

    ప్రధాన పార్టీల్లో రెబల్స్ సమస్య

    ప్రధాన పార్టీల్లో రెబల్స్ సమస్య

    ఒక కుటుంబానికి ఒకటే టికెట్‌ విధానం అమలు కారణంగా కాంగ్రెస్ లో టికెట్‌ దక్కకపోవడంతో ఇతర పార్టీల్లోకి వెళ్లి బరిలో నిలిచినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పటియాలా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న ప్రణీత్‌ కౌర్‌.. తన భర్త, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ అధినేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక, బీజేపీ పూర్తిగా మోదీ ఛరిష్మా.. అమిత్ షా చాణక్యం పైనే ఆశలు పెట్టుకుంది. ప్రధాని మోదీ ఇప్పటికే పంజాబ్ లో ప్రచారం నిర్వహించారు. ఇక, ఆప్ సైతం ఈ సారి పోలింగ్ పైన భారీగా ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతామనే విధంగా ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలు పైకి ఎంత ధీమాగా ఉన్నా.. లోలోపల మాత్రం అంతర్గతంగా ఉన్న సమస్యలు ఎటువంటి ఫలితాలకు కారణం అవుతాయనే టెన్షన్ తో కనిపిస్తున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+