2,000 మందితో 'అంతర్జాతీయ టాయిలెట్ ఫెస్టివల్'

న్యూఢిల్లీ: టాయిలెట్ల ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేందుకు గాను ఢిల్లీలో అంతర్జాతీయ టాయిలెట్ పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు భూటాన్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, ఆఫ్గనిస్ధాన్, లాయిస్ దేశాలు పాల్గొనున్నాయి.

మూడు రోజుల జరగనున్న ఈ అంతర్జాతీయ టాయిలెట్ ఫెస్టివల్ నవంబర్ 18న ప్రారంభం కానుంది. బృందేశ్వర్ పాఠక్ స్ధాపించిన సామాజిక సంస్ధ సులభ ఇంటర్నేషనల్ ద్వారా ఈ కార్యక్రమాన్నినిర్వహించనుంది.

ప్రారంభ వేడుకలో వివిధ దేశాలకు చెందిన సుమారు 1,000 మంది విద్యార్ధులు మానవహారం లాగా ఏర్పడి "2019 కల్లా అందరికి టాయిలెట్స్" అనే ప్రతిజ్ఞ చేయనున్నట్లు పాఠక్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 2,000 మంది పాల్గొనున్నారని సమాచారం.

International toilet festival in Delhi

విద్యార్ధులతో పాటు 200 మంది పారిశుధ్యం రంగానికి సంబంధించిన వర్కర్లు.. 100 మంది వితంతువులతో పాటు ఇతరులు కూడా సెంట్రల్ ఢిల్లీ నుంచి మానవహారం లాగా ఏర్పడి తలపై ఫైబర్ టాయిలెట్ కుండను మోస్తూ ప్రదర్శన చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో సులభ ఇంజనీర్లు రూపొందించిన రెండు అడుగుల ఎత్తైన పెద్ద టాయిలెట్ కుండతో పాటు.. చెక్క షీట్స్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి వివిధ మెటీరియల్స్‌తో వినూత్న ప్రచారం చేస్తామన్నారు.

ఈ టాయిలెట్ కుండను దక్షిణి ఢిల్లీలో ఉన్న సులభ టాయిలెట్ మ్యూజియంకు కార్యక్రమ అనంతరం ఇవ్వనున్నట్లు పేర్కొంది. రాబోయే కాలంలో వీటిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల కోసం పంపనున్నామన్నారు. ఇలాంటి ప్రదర్శన వల్ల ప్రజలకు టాయిలెట్ అవశ్యకతను తెలియజేయడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.

టాయిలెట్స్‌తో పాటు పారిశుధ్యంకు సంబంధించిన సినిమాలను కూడా గ్రామాల్లో చూపించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేశామని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

భారత ప్రధాని ఇంటింటికీ మరుగుదొడ్లు ఉన్నాయా? లేవా? అని పరిశీలించాల్సి వస్తోందని, లేని చోట్ల వాటిని కట్టించాల్సి వస్తోందని, ఆ పనిని కూడా ఇష్టంగానే చేస్తున్నానని సిడ్నీలోని ఒలింపిక్ పార్క్‌లో వ్యాఖ్యానించారు. సిడ్నీలో ఆయన మాట్లాడుతూ, ఇల్లు శుభ్రంగా ఉంటే గ్రామం, ఆపై రాష్ట్రం, తద్వారా దేశం బాగుంటాయని, 'స్వచ్ఛ భారత్' అంటే అదేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+