వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్నెట్ స్వేచ్ఛ: ఐటీ చట్టంలోని 66ఏని కొట్టేసిన సుప్రీం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏని సుప్రీం కోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. సోషల్ మీడియాలోని పోస్టింగులకు సంబంధించిన వాటిపై తీసుకునే చర్యల పైన సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. సెక్షన్ 66ఏ రాజ్యాంగ వ్యతిరేకమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

వెబ్ సైట్లలో నేరపూరిత అంశాలు ఉంచితేనే 66ఏ సెక్షన్ కింద అరెస్టు చేసే అవకాశముందని చెప్పింది. సెక్షన్ 66ఏ పైన గతంలోనే పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగుల పైన ఇష్టం వచ్చినట్లుగా చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు చెప్పిది.

Internet freedom at last: Section 66 A of IT act struck down

పౌరుల భావ వ్యక్తీకరణ హక్కును సెక్షన్ 66ఏ ఉల్లంఘ ఇస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో అభ్యంతరక అంశాలు ఉంచితే 66ఏ సెక్షన్ కింద అరెస్టు చేసి, మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించే అధికారం ఉంది. దీనిపై గతంలో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ 2012లో తొలిసారి న్యాయ విద్యార్థిని శ్రేయా సింఘాల్ పిటిషన్ వేసింది. శివసేన అధినేత బాల్ థాకరే చనిపోయినప్పుడు ముంబైలో బంద్ పాటించడంపై ఓ విద్యార్థిని ఫేస్‌బుక్‌లో వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆ కామెంటుకు మరొకరు లైక్ కొట్టడంతో దానిని నేరంగా పరిగణించి అరెస్టు చేశారు.

English summary
The Supreme Court today struck down the validity of Section 66 A of the Information Technology (IT) Act terming it as unconstitutional.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X