వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లఖీమ్‌పూర్‌లో ఇంటర్నేట్ బంద్, 8కి చేరిన మృతుల సంఖ్య, ప్రియాంక గాంధీ హౌస్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో నిరసన చేస్తున్న రైతులపైకి మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లింది. 8 మంది చనిపోయారు. హింస చెలరేగడంతో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని నియంత్రించేందుకు భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

 Internet suspended in UP’s Lakhimpur Kheri after deadly clash claims 8 lives

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రోడ్డు పక్కన నిరసన తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌లోని వాహనాలు కొందరు రైతులను ఢీకొన్నాయని సంయుక్త కిసాన్‌ మోర్చా ఆరోపించింది. లఖింపూర్‌లో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు.

లఖిమ్‌పూర్‌ ఖేరీలో డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కార్యక్రమానికి హాజరవుతున్న విషయం తెలుసుకున్న రైతులు నల్లజెండాలతో నిరసన తెలుపాలని భావించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ కారు రైతులపైకి దూసుకొచ్చింది. అందరు చూస్తుండగానే రైతులను గుద్దుకుంటూ వెళ్లిపొయింది

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశీష్‌ మిశ్రా కారు నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు స్వాగతం పలికి తీసుకొచ్చేందుకు ఆశీష్‌ మిశ్రా వెళ్తున్నట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. అదనపు డీజీపీ ప్రశాంత్‌కుమార్‌ను లఖిమ్‌పూర్‌ ఖేరీకి వెళ్లి పరిస్థితి సద్దుమణిగేలా చూడాలని ఆదేశించారు. పలువురు ఉన్నతాధికారులు లఖిమ్‌పూర్‌ ఖేరీలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు డీజీపీ ముకుల్‌ గోయల్‌ తెలిపారు.

Recommended Video

ఏపీని డ్రగ్స్ మాఫియాగా మార్చిన సీఎం అంటున్న టీడిపి!!

ఘటనను రైతుల హత్యగా కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం లఖింపూర్ ఖేరిని సందర్శించి బాధిత రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో.. ఆమెను ముందస్తుగా అరెస్ట్ చేశారు. గృహ నిర్బందం చేయడంతో.. సోమవారం లఖీమ్ పూర్ పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి.

English summary
deadly clash broke out between a group of protesting farmers and the convoy of Union Minister of State for Home Ajay Misra’s son Ashish Misra in Uttar Pradesh’s Lakhimpur Kheri on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X