నమ్మ అవార్డుకు ఎంపికైన ఐపీఎస్ అధికారిణి రూప,తిరస్కరిస్తూ లేఖ

బెంగుళూరు: అన్నాడిఎంకె బహిష్కృత నేత శశికళ రాజభోగాలను వెలుగులోకి తెచ్చిన ఐసీఎస్ అధికారిణి రూపను నమ్మ పౌండేషన్ ప్రతి ఏటా ఇచ్చే ఉత్తమ అధికారి జాబితా కింద అవార్డుకు ఎంపిక చేశారు. అయితే ఈ అవార్డును మాత్రం ఆమె అంగీకరించలేదు.ఈ అవార్డును తీసుకోవడానికి తన మనస్సు అంగీకరించడం లేదని ఆమె నమ్మ పౌండేషన్‌కు లేఖ రాశారు.

అన్నాడిఎంకె బహిష్కృత నేత కర్ణాటక రాష్ట్రంలోని పరప్పర ఆగ్రహర జైలులో రాజభోగాలను అనుభవించారు. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారిణి రూప బట్టబయలు చేశారు. తీవ్ర ఒత్తిళ్ళు ఎదురైనా ఆమె ఈ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు.

 IPS D Roopa refuses to accept Namma Bengaluru Awards

బెంగుళూరుకు చెందిన నమ్మ పౌండేషన్ ప్రతి ఏటా 5 రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందిస్తోంది. అయితే అందులో ఉత్తమ ప్రభుత్వ అధికారి కేటగరి కింద 8 మంది అధికారుల జాబితాను తయారు చేసింది. ఈ జాబితాలో ఐపీఎస్ అధికారిణి రూప పేరును కూడ చేర్చారు.

ఈ జాబితా నుండి తన పేరును తొలగించాలని ఐపీఎస్ అధికారిణి రూప కోరుతున్నారు. ఈ మేరకు నమ్మ పౌండేషన్ సీఈఓ ఎణ్బీఎఫ్ శ్రీధర్‌కు ఆమె లేఖ రాశారు. అయితే ఈ అవార్డును స్వీకరించేందుకు తన మనస్సు అంగీకరించడం లేదన్నారు. ఈ అవార్డుకు తన పేరును ఎంపిక చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

రాజకీయాలకు, రాజకీయ అనుబంధ సంస్థలకు ప్రభుత్వాధికారులు వీలైనంత దూరంగా ఉండాలి. అప్పడే అధికారులపై ప్రజలకు మంచి పేరు ఉంటుందని ఆమె ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. నమ్మ పౌండేషన్ చైర్మెన్ రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి తరపున ఎంపీగా విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+