వైరల్ వీడియో: ఈ కలెక్టర్ల పెళ్లి ఖర్చు కేవలం రూ. 2 వేలే..
ఇటీవలి కాలంలో పెళ్లిళ్ల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ లు, హల్దీ, ఖరీదైన ఫంక్షన్ హాళ్లు, లెక్కలేనన్ని వంటకాలు ఇదీ ఇప్పటి ట్రెండ్. దీంతో ఇప్పుడు పెళ్లంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు తమ స్థాయికి మించిన ఖర్చు చేస్తూ కష్టాల్లో కూరుకుపోతున్నారు. అలా ఓ మధ్య తరగతి కుటుంబానికి అయ్యే ఖర్చు అంచనా దాదాపుగా రూ. 15 లక్షలనుంచి రూ. 17 లక్షలు ఉంది. ఈ క్రమంలో ఓ జంట అందరికీ ఆదర్శంగా నిలిచింది. అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకుని ఎంతో మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఘటన రెండేళ్ల క్రితమే జరిగినా ఇప్పటికీ ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది.
తెలంగాణ కేడర్ కు చెందిన ఐపీఎస్ మౌనిక చత్తీస్ గఢ్ కేడర్ కు చెందిన IAS అధికారి యువరాజ్ దంపతులు 2022 బ్యాచ్ కు చెందినవారు. 2022లో ముస్సోరీలో ట్రైనింగ్ లో ఉన్న టైంలో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 2023లో వీరిద్దరూ సింపుల్ గా కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు.

ఆ తర్వాత కేవలం రూ. 2 వేల రూపాయల ఖర్చుతో సింపుల్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి పూల దండలు మార్చుకొని అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. అయితే తాజాగా ఈ ఐఏఎస్ జంట రెండో వివాహ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా తమ పెళ్లి జరిగిన తీరును గుర్తుచేసుకుంటూ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. చిన్న చిన్న ఫంక్షన్ లకే రూ. లక్షల్లో ఖర్చు చేసే నేటి ప్రపంచంలో ఈ జంట ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications