వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాస్తా తినడం మంచిదేనా? తింటే లావు అవుతారా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాస్తా

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేయాలని, ఆహారం విషయంలో ఏం తినాలి, ఏం తినకూడదో చార్ట్ తయారుచేసుకుంటారు.

ఎక్కువ పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) తినకూడదు లేదా ప్యాకేజీ ఆహారం తీసుకోకూడదని తీర్మానించుకుంటారు. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్‌లో పిజా, పాస్తా లాంటివి మొదటి వరుసలో ఉంటాయి.

మరి పిండి పదార్థాలు తినకూడదు అంటే ఇష్టమైన పిజా, పాస్తాలు మానేయాలి. అలా చేస్తే, మన డైట్ మెరుగుపడినట్లేనా?

ఇది పోషకాహారాన్ని తగ్గించే విధానం అవుతుంది. ఆహారంలో ఒక ముఖ్యమైన పదార్థాన్ని తినకుండా ఉండడం మంచి డైట్ కాదు.

పాస్తా సంగతి చూద్దాం. ఈమధ్య కాలంలో పిల్లలు, పెద్దలు కూడా పాస్తాను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇళ్లల్లోనూ వండుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో రకరకాల రెసిపీలు అందుబాటులో ఉన్నాయి.

పాస్తాలో కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉండవు. సుమారు 145 గ్రాముల పాస్తా (ఒక కప్పు)లో ఇంచుమిందు 38 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 7.7 గ్రాముల ప్రొటీన్లు, 0.6 గ్రాముల కొవ్వుపదార్థాలు ఉంటాయి. అదనంగా, పాస్తా వండుతున్నప్పుడు అది పీల్చుకునే నీరు. అందులోని విటమిన్లు, మినరల్స్.

ఈ లెక్క ప్రకారం, పాస్తాలో ఎక్కువ శాతం ఉన్నవి కార్బోహైడ్రేట్లే కదా అని మీరు అడగవచ్చు. నిజమే కానీ, అది పూర్తి నిజం కాదు. మనం మరి కొన్ని లెక్కలు చూడాలి.

కేలరీలు

రోజులో ఏది ఎక్కువ తినాలి?

ఒకరోజుకు మన శరీరానికి ఎన్ని కేలరీలు కావాలి, ఎంత తినాలి అన్న లెక్కలు మీ అందరికీ తెలిసే ఉంటుంది. శరీర బరువు, జెండర్, శారీరక చురుకుదనం మొదలైన వాటి ఆధారంగా కూడా ఈ లెక్కలు ఉంటాయి.

అయితే, మాక్రోన్యూట్రియంట్ ప్రొఫైల్ అనే లెక్క ఒకటి ఉంటుందని మీకు తెలుసా? అంటే మన శరీరానికి శక్తిని అందించే వివిధ పదార్థాల లెక్క.

కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, మాంసకృతులను మాక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఇవి శరీరంలో చిన్న చిన్న భాగాలుగా విచ్ఛినం అయి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

వీటిని రోజూ ఎంత మోతాదులో తీసుకోవాలన్నది ఆహార నిపుణులు సూచిస్తారు.

వీటిని శరీరానికి సరిపడా తీసుకోవడమే లక్ష్యం. మోతాదు అధికం కాకుండా చూసుకోవాలి. మోతాదు ఎక్కువైనా, తక్కువైనా శరీరానికి ప్రమాదమే.

వీటితో పాటు తగినంత విటమిన్స్, మినరల్స్ కూడా శరీరానికి అందాలి.

రోజుకు కార్బోహైడేట్ల నుంచి 45-65 శాతం, ప్రొటీన్ల నుంచి 10-30 శాతం, కొవ్వు పదార్థాల నుంచి 20-35 శాతం శక్తి మన శరీరానికి అందాలి.

అంటే ప్రొటీన్ల కన్నా 1.2 నుంచి 6.5 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్లు తినడం ఆరోగ్యకరం. ఒక గ్రాము కార్బోహైడ్రేట్‌లో ఎంత శక్తి ఉంటుందో, అంతే శక్తి ఒక గ్రాము ప్రొటీన్‌లో కూడా ఉంటుంది.

పాస్తాలో కార్బోహైడ్రేట్, ప్రొటీన్ నిష్పత్తి ఇంచుమిందు 5:1 ఉంటుంది. ఇది కావలసిన మాక్రోన్యూట్రియెంట్స్ పరిధిలోనే ఉంది.

నిజానికి, పాస్తాలో కార్బోహైడ్రేట్లను బ్యాలన్స్ చేయడానికి తగినంత ప్రొటీన్లు ఉన్నాయి.

పాస్తా తయారీలో గోధుమలు, గుడ్లు వాడతారు. ఈ రెండింటిలోనూ ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

కేలరీలు

బరువు పెరగడానికి, కేలరీలకు ఉన్న సంబంధం మనం అనుకున్నంత సరళంగా ఉండదు.

క్రమం తప్పకుండా పాస్తా తింటే బరువు తగ్గుతారని కూడా కొన్ని అధ్యయనాల్లో తేలింది. చపాతీలు లేదా బ్రెడ్, బంగాళదుంపల కన్నా పాస్తా శరీరంలో చక్కెర స్థాయిలకు మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

పాస్తా పూర్తిగా మానేయడం కంటే తక్కువ తినడం లేదా హోల్ వీట్ పాస్తా తినడం మేలు. ఇది తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు కూడా.

ఈ మధ్య గ్లూటెన్ ఫ్రీ పాస్తా అని వస్తోంది. ఇందులో ప్రొటీన్లు కొంచం తక్కువ ఉంటాయి. దీనివల్ల వచ్చే అదనపు లాభాలేమీ లేవు. గ్లూటెన్ పడనివారికి ఇది పనికొస్తుంది తప్పితే సాధారణ ప్రజలకు పెద్ద లాభమేమీ లేదు.

ఉత్తి పాస్తా తింటే బ్లడ్ షుగర్ స్థాయిలు పెరుగుతాయని కొందరు భయపడుతుంటారు.

ఉత్తి పాస్తా ఎలాగూ తినలేం. దానిలో కూరగాయ ముక్కలు, పాస్తా సాస్ లాంటివి వేసుకుంటే అమినో యాసిడ్స్ లాంటివి కూడా శరీరానికి అందుతాయి.

ఆహారం

మైక్రోన్యూట్రియంట్స్ అంటే?

విటమిన్లు, మినరల్స్ వంటి వాటిని మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఒక కప్పు పాస్తాలో పావు వంతు బీ1, బీ9 విటమిన్లు ఉంటాయి.

బాగా చల్లారిపోయిన పాస్తాలో కొన్ని కార్బోహైడ్రేట్లు స్టార్చ్‌గా మారుతాయి. ఇది మెల్లిగా జీర్ణం అవుతుంది. అంటే శరీరానికి తక్కువ శక్తి అందిస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు అసాధరణంగా పెరగవు. కాబట్టి చల్లారిన పాస్తాను వేడి చేసుకుని తిన్నా నష్టమేం లేదు.

బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు తగ్గించాలా?

పిండి పదార్థాలు తగ్గిస్తే బరువు తగ్గుతారని చాలామంది అనుకుంటారు. కానీ, కార్బోహైడ్రేట్లు వివిధ పదార్థాలలో వివిధ రూపాలలో ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి.

పాస్తా లాంటి వాటిలో ఉండే పిండి పదార్థాలు శరీరానికి కీడు చేయవు. కానీ, కేకులు, స్వీట్లు మొదలైన వాటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మాత్రం అంత మంచివి కావు. ఇందులో రిఫైండ్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

బరువు తగ్గాలంటే స్వీట్లు తినడం తగ్గించాలి. కూరగాయలతో పాటు తినే పాస్తా లాంటివి తగ్గించడం వల్ల ప్రయోజనం ఉండదు.

(ఎమ్మా బెక్కెట్ యూకేలో న్యూక్యాసల్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌ విభాగంలో ఫుడ్ సైన్స్ హ్యూమన్ న్యూట్రిషన్‌లో సీనియర్ లెక్చరర్.

ఈ కథనం మొదటది కాన్వర్జేషన్‌లో పబ్లిష్ అయింది. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద ఇక్కడ మళ్లీ అందిస్తున్నాం. )

ఇవి కూడా చదవండి:

English summary
Is it good to eat pasta? Will you get fat if you eat it?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X