వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గంలో మాజీ ప్రధాని, మాజీ సీఎం పోటీ: ఐటీ సంస్థల దెబ్బ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి ఇద్దరు ప్రముఖులు పోటీ పడటానికి సిద్దం అవుతున్నారు. మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం. కృష్ణ లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ బరిలో ఉంటారని ఓ ఆంగ్ల దిన పత్రిక వార్త ప్రచురించింది.

రోజుకు ఒక్కరి పేరు

రోజుకు ఒక్కరి పేరు

బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారో అని ఉత్కంఠ మొదలైయ్యింది. రోజుకు ఒకరి పేరు తెర మీదకు వస్తోంది. కేంద్ర మంత్రి డివీ. సధానంద గౌడ ప్రస్తుతం ఈ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడను ఓడించే శక్తి మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణకు మాత్రమే ఉందని బీజేపీ నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చారని సమాచారం.

ఒకే వర్గం నాయకులు

ఒకే వర్గం నాయకులు

మాజీ ప్రధాని దేవేగౌడ, ఎస్.ఎం. కృష్ణ ఒక్కలిగ వర్గానికి చెందిన వారు. ఇద్దరు నాయకులకు మంచి పట్టు ఉంది. బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం కైవసం చేసుకోవడానికి ఇటు బీజేపీ అటు జేడీఎస్ నాయకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఇప్పటి వరకూ మాజీ ప్రధాని దేవేగౌడ, ఎస్.ఎం. కృష్ణ ఒకే నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యలేదు.

మాజీ ప్రధానికి సవాలు

మాజీ ప్రధానికి సవాలు

బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ పోటీకి దిగుతున్నారని తెలియడంతో ఆ నియోజక వర్గం ఓటర్లు ఎవరికి ఓటు వెయ్యాలి అని అయోమయంలో ఉన్నారు. బెంగళూరును ఐటీ హబ్ గా తీర్చిదిద్డడంలో మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ శక్తి వంచన లేకుండా పని చేశారని మంచి పేరు ఉంది.

కేంద్ర మంత్రి పరిస్థితి ఏమిటి ?

కేంద్ర మంత్రి పరిస్థితి ఏమిటి ?


బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం ఎంపీ, కేంద్ర మంత్రి సధానంద గౌడ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ? అనే ప్రశ్న ఇప్పుడు మొదలైయ్యింది. బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గంలో ఒక్కలిగ కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటారు అనే చర్చ మొదలైయ్యింది.

8 నియోజక వర్గాల ప్రభావం

8 నియోజక వర్గాల ప్రభావం

బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గంలో 8 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. కేఆర్ పురం, దాసరహళ్లి, బ్యాటరాయనపుర, యశవంతపుర, మహాలక్ష్మి లేఔట్, మల్లేశ్వరం, హెబ్బాళ, పులకేశీనగర శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 8 శాసన సభ నియోజక వర్గాల ప్రజల్లో కేంద్ర మంత్రి సధానంద గౌడ మీద మంచి అభిప్రాయం ఉంది. మాజీ ప్రధాని దేవేగౌడ ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే మాజీ ఎంపీ శోభాకరంద్లాజే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

English summary
A report in The Hindu news paper quoted that, Former PM HD Devegowda from JDS and Former CM of Karnataka SM Krishna from BJP may contest opposite in Bengaluru North constituency in Lok Sabha elections 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X