• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌ను వదిలేస్తున్నారా? ఐపీఎల్ ఫైనల్ తర్వాత హర్షాభోగ్లేకు ధోనీ ఇచ్చిన సమాధానం ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
2021 ఐపీఎల్ ట్రోఫీతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ

ఏప్రిల్ 9న చెన్నైలో మొదలైన టోర్నమెంట్‌ 190 రోజుల తర్వాత ఎట్టకేలకు యూఏఈలో ముగిసింది.

కానీ సీఎస్‌కే గెలుపు వేడుకలు గతంలోకంటే తక్కువ సమయమే ఉంటాయి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ కోసం చాలా మంది ఆటగాళ్లు తమ తమ జట్లలో తిరిగి చేరబోతున్నారు.

ఇక ఇప్పుడు అందరి దృష్టి జట్టు కెప్టెన్ ధోనీపై పడొచ్చు.

2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పటి నుంచి ఈ జట్టు ధోనీ సారథ్యంలో మొత్తం నాలుగు సార్లు (2010, 2011, 2018, 2021) ఈ ట్రోఫీ గెలిచింది.

వ్యక్తిగతం కూడా అత్యధిక ఐపీఎల్‌ మ్యాచ్‌లు (230) ఆడిన క్రికెటర్‌గా ధోనీ రికార్డు సృష్టించారు. అలాగే, ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఎనిమిదో వ్యక్తిగా (4746) ఉన్నారు.

ధోనీ సారథ్యంలో సీఎస్‌కే జట్టు నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది

ఇకపై మీ భవిష్యత్తు ఏమిటని అడిగినప్పుడు.. 2022 సీజన్‌ కోసం కొత్తగా వస్తున్న రెండు ఫ్రాంఛైజీల విషయంలో ఏం జరుగుతుందన్న దానిపై అది ఆధారపడి ఉంటుందని ధోనీ చెప్పారు.

'సీఎస్‌కేకు ఏది మంచిదో మనం నిర్ణయించుకోవాలి. ఇది నా గురించి కాదు. జట్టులో ఉండే ముగ్గురు నలుగురు ఆటగాళ్లలో నేను ఉండాలని కోరుకోవడం లేదు. జట్టుకు ఏది మంచిదో అదే చేయాలి’ అని ధోనీ చెప్పారు.

ఫ్రాంఛైజీకి ఎలాంటి సమస్య రాకుండా జట్టును బలంగా తయారు చేయాలి. వచ్చే పది సంవత్సరాల కోసం జట్టుకు ఎవరు సాయం చేయగలరో మనం చూడాలని అన్నారు.

అప్పుడు ప్రెసెంటర్, కామెంటేటర్ హర్ష భోగ్లే "మీరు వారసత్వంగా వదిలివెళ్తున్న దాని గురించి మీరు గర్వపడాలి" అని అన్నారు.. దానికి ధోనీ నవ్వుతూ.. "నేను దీన్నింక వదిలిపెట్టలేదు" అని సమాధానం ఇచ్చారు.

ఐపీఎల్ ట్రోఫీ, ఎంఎస్ ధోనీ

2021 ఐపీఎల్ ఫైనల్ తర్వాత.. మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ ఏమన్నారంటే..

నేను సీఎస్‌కే గురించి చెప్పడానికి ముందు, కేకేఆర్ గురించి మాట్లాడాల్సి ఉంది. ఐపీఎల్‌ను గెలిచే అర్హత ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది కేకేఆరే. పుంజుకుని వాళ్లలా రాణించడం కష్టమైన పని. ఆ క్రెడిట్.. కోచ్‌లు, జట్టు సభ్యులు, వారికి సహకరించిన ఇతర సిబ్బందికి దక్కుతుంది. వారికి బ్రేక్ నిజంగా కలిసొచ్చింది.

గతేడాది నాకౌట్ కూడా చేరని సీఎస్‌కే ఇప్పుడు కప్పు ఎలా కొట్టింది?

ఇక సీఎస్‌కే గురించి చెప్పాలంటే.. మేము ప్లేయర్లను మార్చాము. ఒక్కో గేమ్‌లో ఒక్కొక్కరు బాగా రాణించారు. ప్రతి ఫైనల్ ప్రత్యేకమే. మీరు గణాంకాలను పరిశీలించినట్లయితే, ఫైనల్లో తరచూ ఓడిపోయే జట్లలో మేము కూడా ఉన్నామని చెప్పొచ్చు. ముఖ్యం నాకౌట్స్‌లో తిరిగి పుంజుకోవడం చాలా ముఖ్యమని నేను అనుకుంటాను. నిజంగా మేము పెద్దగా చర్చించుకోము. మేము సమావేశాలు పెద్దగా పెట్టుకోము. ఒకరితో ఒకరు ముఖాముఖిగానే మాట్లాడుకుంటాం. ప్రాక్టీస్‌ చేసేటప్పుడే మేము అన్ని విషయాలు చర్చిస్తాం.

టీమ్ రూంలోకి అడుగుపెట్టగానే మీరు భిన్నమైన ఒత్తిడికి గురవుతారు. కానీ మా ప్రాక్టీస్ సెషన్లు చాలా బాగుంటాయి. దానికి మా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాలి. మేము ఎక్కడ ఆడినా చివరికి దక్షిణాఫ్రికాలో ఆడినా.. అక్కడ కూడా కొందరు సీఎస్‌కే ఫ్యాన్స్ ఉంటారు. మీరు కోరుకునేది అదే. వాళ్లను చూస్తే నేను చెన్నైలోనే ఆడుతున్నట్లు అనిపిస్తుంది. అభిమానుల కోసం మేము మళ్లీ చెన్నై జట్టులోకి వస్తామని అనుకుంటున్నా.

ఎంఎస్ ధోనీ

ధోనీ.. నెక్ట్స్ ఏంటి?

కానీ నేను ముందే చెప్పినట్లు అది బీసీసీఐపై ఆధారపడి ఉంటుంది. రెండు కొత్త జట్లు వస్తున్నాయి. సీఎస్‌కేకు ఏది మంచిదో మనం నిర్ణయించుకోవాల్సి ఉంది. జట్టులో ఉండే ముగ్గురు, నలుగురు ఆటగాళ్లలో నేను ఉండాలని అనుకోవడం లేదు. ఈ ఫ్రాంఛైజీ ఎలాంటి ఇబ్బందిపడకుండా బలమైన జట్టును తయారు చేయాలి. రాబోయే పది సంవత్సరాల పాటు జట్టుకు ఎవరు సహకరించగలరో పరిశీలించే విషయంలో మనం కఠినంగా ఉండాలి.

హర్ష భోగ్లే: 'మీరు వదిలివెళ్తున్న వారసత్వం గురించి మీరు గర్వపడొచ్చు'

ధోనీ: "నేనింక వదిలిపెట్టలేదు..." (నవ్వుతూ)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Is MS Dhoni leaving Chennai Super Kings? What was Dhoni's response to Harsha bhogle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X