• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?

By BBC News తెలుగు
|

కరోనా వైరస్

భారత దేశంలో కరోనావైరస్ ఉధృతంగా కొనసాగుతున్న కాలమిది. సెకండ్ వేవ్ ప్రతాపానికి దేశ ఆరోగ్య వ్యవస్థ చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. అయితే వ్యాప్తి మందగించిందని, కేసుల సంఖ్య తగ్గు ముఖం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. అది ఎంత వరకు నిజం?

వ్యాప్తి రేటు ఎలా పెరిగింది?

మార్చి ద్వితీయార్ధం నుంచి భారత దేశంలో కోవిడ్‌ వ్యాప్తిలో పెరుగుదల మొదలైంది. ఏప్రిల్ 30నాటికి ఇది రికార్డు స్థాయికి చేరుకుంది. ఒకే రోజు 4 లక్షల కేసులు కూడా నమోదయ్యాయి.

ఆ తర్వాత కొద్ది రోజులకు అంటే మే 3 నాటికి వాటి సంఖ్య 3,60,000కు పడిపోయింది. దీంతో ఇండియాలో కోవిడ్ పీక్‌స్టేజ్ దాటిందని అంచనా వేశారు.

కానీ, ఆ తర్వాత మళ్లీ కేసులు వేగంగా పెరగడం మొదలు పెట్టింది. కొన్ని వారాల డేటాను గమనిస్తే, సోమవారం నాడు కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు కనిపించింది.

మే 5న 4.12 లక్షల కేసులు నమోదయ్యాయి. వారం రోజుల సగటు వ్యాప్తిని పరిశీలించినప్పుడు కూడా అది పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

కరోనా వైరస్

టెస్టులు నిరంతరం జరుగుతున్నాయా?

వైరస్ వ్యాప్తి ట్రెండ్‌ను తెలుసుకోవాలంటే పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహించాలి. భారతదేశంలో ప్రతిరోజూ ఇరవై లక్షల పరీక్షలు జరుగుతున్నాయి. కానీ ఈ నెల ఆరంభంలో వాటి సంఖ్య 15 లక్షలకు పడిపోయింది.

అయితే, మే 5న టెస్టుల సంఖ్య 20 లక్షలకు చేరింది. అంటే టెస్టులు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టడం వల్ల మే మొదటి వారంలో కేసుల సంఖ్య కూడా తగ్గినట్లు కనిపించింది.

''గత ఏడాది సెప్టెంబరులో చివరిలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కన్సల్టెంట్, ఆర్థికవేత్త డాక్టర్ రిజో జాన్ అన్నారు.

''భారతదేశంలో రోజువారీ కేసులు లక్ష దాటినప్పుడు, టెస్టుల సంఖ్య కూడా తగ్గింది'' అని అన్నారాయన.

కొన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నాయని అధికారులు ప్రకటించినప్పుడు, అదే సమయంలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, దిల్లీ వంటి రాష్ట్రాల్లో టెస్టులు కూడా తగ్గాయి.

ఏప్రిల్ నెల మధ్య కాలంలో దిల్లీలో రోజుకు లక్ష పరీక్షలు చేసినప్పుడు, 16 వేల కేసులు బైటపడ్డాయి. కానీ అదే ఏప్రిల్ చివరిలో టెస్ట్ రేట్ 20 శాతం పడిపోయినా, పాజిటివ్ కేసులు 55 శాతానికి పైగా పెరిగాయి.

గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఇదే ధోరణి కనిపించింది.

టెస్టింగ్ సామర్ధ్యం లేని చోట ఆరోగ్య కేంద్రాలపై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందని డాక్టర్ జాన్ తెలిపారు.

ఇండియాలో ప్రతి వెయ్యి మందిలో టెస్టింగ్ 1.3 కాగా, అమెరికాలో 3, ఇంగ్లాండ్ 15 మందిగా ఉంది.

కరోనా వైరస్

టెస్టుల్లో పాజిటివిటీ రేటు ఏ స్థాయిలో ఉంది?

అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతంలో జనాభా ఎక్కువగా లేదని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది.

పాజిటివిటీ రేటు వరసగా రెండు వారాలపాటు 5 శాతం కన్నా తక్కువగా నమోదయ్యే వరకు ఆంక్షలు సడలించ వద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

''ఇండియాలో పాజిటివిటీ రేటు 20 శాతంకన్నా ఎక్కువగా ఉంది. అందువల్ల సెకండ్ వేవ్ మందగిస్తోంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు'' అని అశోకా యూనివర్సిటీలో ఫిజిక్స్ అండ్ బయాలజీ ప్రొఫెసర్, మేథమేటిక్స్ మోడలర్ గౌతమ్ మీనన్ వెల్లడించారు.

కరోనా వైరస్

ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు?

భారత దేశంలో రెండు రకాల పరీక్షలు జరుగుతున్నాయి. అందులో మొదటిది పాలిమరీస్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) టెస్ట్. దీన్ని అత్యంత సమర్ధవంతమైన టెస్టుగా పరిగణిస్తున్నారు. అయితే, ఈ టెస్టులు కొత్త వేరియంట్లను గుర్తించలేక పోయినట్లు రిపోర్టులు వచ్చాయి.

ఇక రెండోది యాంటీజెన్. వేగంగా ఫలితాన్ని ఇచ్చే యాంటీజెన్ టెస్టుకు చాలా రాష్ట్రాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులో రిపోర్టు త్వరగా వస్తుంది కానీ, దీన్ని పూర్తిగా నమ్మలేం.

ఏప్రిల్ నెలలో దిల్లీలో నిర్వహించిన పరీక్షల్లో 35శాతం పరీక్షలు యాంటీజెన్ టెస్టులే. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో యాంటీజెన్ పరీక్షలను కూడా మరింతగా ఉపయోగించాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజాగా సూచించింది.

దీంతోపాటు ప్రయాణికులకు తప్పనిసరి పీసీఆర్ టెస్టుల నిబంధనను కూడా సడలించారు. దీంతో ల్యాబ్‌లపై ఒత్తిడి తగ్గించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is the second wave of coronavirus weakening in India,Are cases really declining
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X