మసీదుపై ఐఎస్ఐఎస్ బాంబు దాడి: 21 మంది దుర్మరణం

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో ఘోరం జరిగింది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలుడు జరిగి 21 మంది దుర్మరణం చెందారు. ఈ దాడిలో అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

సౌదీ అరేబియా పశ్చిమ ప్రావెన్స్ లోని షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. సౌదీ అరేబియా పశ్చిమ ప్రావెన్స్ లోని ఖీదా గ్రామంలోని షియా మసీదులో ముస్లీం సోదరులు సామూహిక ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లారు.

 ISIS

ఆ సమయంలో ఒక వ్యక్తి మసీదు లోపలికి వెళ్లాడు. తరువాత అతను ముందుగా తన శరీరానికి అమర్చుకున్న బాంబులు పేల్చేసుకున్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో 21 మంది మరణించారని సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ మంత్రి అధికారికంగా వెల్లడించారు.

ఈ దాడిలో 80 మందికి పైగా గాయపడి వివిధ ఆసుపత్రులలో చికిత్స పోందుతున్నారని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) ఈ దాడులు చేసింది తామే అని ప్రకటించుకున్నారు. షియాలే తమ టార్గెట్ అని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+