వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వం గ్రీన్ సిగ్నల్: సీఎస్ ఇంటిలో ఐటీ దాడి !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితుడైన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావును టార్గెట్ చేసుకుని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అదికారులు దాడులు చేశారని సమాచారం.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితుడైన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావును టార్గెట్ చేసుకుని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అదికారులు దాడులు చేశారని సమాచారం.

తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు ఇంట్లో తనఖీలకు ఐటీ శాఖ అధికారులు ఆ రాష్ట్ర సీఎం పన్నీర్ సెల్వం వద్ద ముందస్తు అనుమతి తీసుకున్నారని తెలిసింది. రామ్మోహన్ రావు నివాసంతో పాటు ఆయన కార్యాలయంలో తనిఖీలు చెయ్యడానికి పన్నీర్ సెల్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

పన్నీర్ సెల్వంకు షాక్: శేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ

తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలోనే సీఎం పన్నీర్ సెల్వం ఆ రాష్ట్ర హోం శాఖా కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, డీపీజీ అందుబాటులో ఉన్న నలుగురు మంత్రులతో సెక్రటేరియట్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

IT department officials raided the house of TN CS P Rama Mohana Rao

రామ్మోహన్ రావు ఇంటిలో సోదాలు చేస్తున్న సమయంలోనే 30 మంది ఐటీ అధికారులు పారామిలటరీ బలగానుల వెంటపెట్టుకుని సెక్రటేరియట్ చేరుకున్నారు. అదే సమయంలో సీఎం పన్నీర్ సెల్వం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మద్యాహ్నం 2 గంటల సమయంలో సీఎం పన్నీర్ సెల్వం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని ముందుగా మీడియాకు సమాచారం ఇచ్చినా చివరి నిమిషంలో రద్దు చేశారు. పన్నీర్ సెల్వంకు పూర్తి వివరాలు చెప్పిన తరువాత సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిలో, ఆయన కార్యాలయంలో తనిఖీలు చేశారని విశ్వసనీయ సమాచారం.

షాక్: పన్నీర్ సెల్వం పీఏ ఇంటిలో ఐటీ సోదాలు ?

సీఎస్ కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసిన ఐటీ శాఖ అధికారులు దాదాపు 40 ఫైల్స్, ల్యాప్ టాప్, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్ రావుకు సహాయకులుగా పని చేస్తున్న కుమార్, శేఖర్ అనే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి ఐటీ అధికారులు వెంట తీసుకు వెళ్లారు.

IT department officials raided the house of TN CS P Rama Mohana Rao

సెక్రటేరియట్ లోకి పారామిలటరీ బలగాలతో ఐటీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో ఏదో జరిగిపోయిందని ఆందోళన చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు అక్కడి నుంచి ఒక్క సారిగా వెళ్లిపోయారు. ఒకే సారి అంత మంది ఐఏఎస్ అధికారులు సెక్రటేరియట్ నుంచి వెళ్లిపోవడంతో కలకలం రేగింది.

English summary
Income tax department officials raided the house of Tamil Nadu chief secretary P Rama Mohana Rao in Chennai on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X