కాంగ్ ఝలక్: నితీష్ కుమార్ అసంతృప్తి, బిజెపి చురక

యూపిఏ ప్రభుత్వం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం కొద్దికాలంగా ఆసక్తి చూపుతూ వచ్చిందని, ఆ దిశగా కొన్ని చర్యలు కూడా తీసుకుందన్నారు. ఇప్పుడు అవన్నీ అటకెక్కాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెసు తన ప్రాధాన్యాలను మార్చుకుంటోందని విమర్శించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా తమ హక్కు అని, దానిని సాధిస్తామని చెప్పారు. ఆర్జేడి, కాంగ్రెసు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
కొంతకాలం క్రితం ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన జెడి(యు) కాంగ్రెసు వైపు వెళ్లేందుకు సిద్ధమైంది. కాంగ్రెసు పార్టీ కూడా నితీష్ కుమార్ వైపు మొగ్గింది. ఇలాంటి తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల మళ్లీ తాము కాంగ్రెసుతోనే జత కడతామని, బిజెపితో కలిసి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెసు కూడా జెడి(యు) కంటే లాలూకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. దీనిపై జెడి(యు) అసంతృప్తితో ఉంది.
నితీష్‌కు బిజెపి చురక
కాంగ్రెసు పార్టీ మళ్లీ ఇప్పుడు నితీష్ కుమార్‌ను పక్కన పెట్టి లాలును దగ్గరకు తీసుకుంటుందని బీహార్ బిజెపి నేత సుశీల్ కుమార్ మోడీ అన్నారు. బిజెపికి నమ్మకద్రోహం చేసిన నితీష్‌ను చరిత్ర మరిచిపోదన్నారు.












Click it and Unblock the Notifications