సీఎం సన్నిహితులపై ఐటీ కొరడా.. 50 చోట్ల సోదాలు.. 9 కోట్లు స్వాధీనం..!
ఇండోర్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితుడు, ఓఎస్‌డీ ప్రవీణ్ కక్కర్ ఇళ్లపై.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం చర్చానీయాంశమైంది. ఏకకాలంలో మొత్తం 50 చోట్ల సోదాలు చేస్తుండటం కలకలం రేపింది.
ఆయనపై హవాలా లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రవీణ్ కక్కర్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మధ్యప్రదేశ్, ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు అధికారిక కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు.

ఐటీ దాడులకు సంబంధించి దాదాపు 300 మంది సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గోవా, భులా, భోపాల్, ఇండోర్ తదితర 50 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు అమైరా గ్రూప్ మోసర్ బేయర్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏకంగా 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. కమల్ నాథ్ దగ్గరి బంధువు రతుల్ పురితో పాటు మరో సన్నిహితుడు రాజేంద్ర కుమార్ మిగ్లానీ ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 9 కోట్ల రూపాయల నగదు లభ్యమైనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications