టెక్కీలకు షాక్: రిక్రూట్‌మెంట్లు లేవు, ఆటోమేషన్ ప్రభావం

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: ఐటీ రంగంలో ఉద్యోగాల నియామాకాలు ఇంకా మందకొడిగానే ఉంటాయని ఇన్పోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 7-8 శాతం పెరగడం కష్టమేనని చెప్పారు.

  ఐటీ జీవులకు మరో గండం: వచ్చే ఆర్నెళ్లు సంక్లిష్టం.. సర్వేలో తేలిన నిజాలు! | Oneindia Telugu

  ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం మందగమనంలో ఉంది. సాప్ట్‌వేర్ రంగంలో చోటుచేసుకొంటున్న మార్పులే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అమెరికాలో చోటుచేసుకొన్న మార్పులు కూడ ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ రంగంపై ప్రభావం చూపుతున్నాయి.

  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అమెరికాలో మార్పులు తీసుకువచ్చారు. ఈ మార్పుల కారణంగా అమెరికాలోని ఇండియా టెక్ కంపెనీలపై ప్రభావం చూపుతోంది.

   ఐటీ ఎగుమతులు 7-8 శాతం పెరగడం కష్టమే

  ఐటీ ఎగుమతులు 7-8 శాతం పెరగడం కష్టమే

  ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 7-8 శాతం పెరగడం కష్టమేనని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వీ బాలకృష్ణన్‌ అన్నారు. వచ్చే ఏడాది ఐటీ రంగంలో వృద్ధి పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చెందిన మార్కెట్లలో పరిస్థితి ప్రోత్సాహకరంగా లేకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ఐటీ రంగం చెప్పుకోదగ్గ వృద్థి సాధించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

  ఆటోమేషన్ ప్రభావంతో రిక్రూట్‌మెంట్‌పై ప్రభావం

  ఆటోమేషన్ ప్రభావంతో రిక్రూట్‌మెంట్‌పై ప్రభావం

  ఆటోమేషన్ ప్రభావంతో ఐటీ రంగంలో రిక్రూట్‌మెంట్‌పై ప్రభావం చూపుతోందని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఐటీ సంస్థల్లో కొత్త ఉద్యోగాల నియామకాలు మందగించాయన్నారు. ఆటోమేషన్‌ ప్రభావంతో మూడు ప్రధాన కంపెనీలు ఉద్యోగుల వృద్థిలో ప్రతికూల వృద్ధిని సాధించాయని చెప్పుకొచ్చారు.

   అమెరికాలో ఆర్థిక వృద్ది మంచి పరిణామం

  అమెరికాలో ఆర్థిక వృద్ది మంచి పరిణామం

  భారత ఐటీ పరిశ్రమకు ప్రధాన వనరుగా ఉన్న అమెరికాలో ఆర్థిక వ్యవస్థ కొంత మేర ఊపందుకోవడం ఊరట ఇచ్చే పరిణామమని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు.

  యూరప్‌లోనూ పరిస్థితి మెరుగుపడటంతో వచ్చే ఏడాది నుంచి ఐటీ ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని చెప్పారు. డిజిటల్‌ రంగంలోనూ భారత్‌ సత్తా చాటాలని డిజిటల్‌ వైపుయ మళ్లే క్రమంలో భారత ఐటీ పరిశ్రమ పెద్దమొత్తంలో నిధులు కేటాయించి నూతన టెక్నాలజీలకు మళ్లే ప్రక్రియపై పెట్టుబడులు పెట్టాల్సిఉందన్నారు.

   ఆ అంచనాలు అందుకోకపోవచ్చు

  ఆ అంచనాలు అందుకోకపోవచ్చు

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ వృద్ధి 7 నుంచి 8 శాతం ఉంటుందన్న నాస్కామ్‌ అంచనాలను ప్రస్తావిస్తూ ఆ స్థాయిలో ఐటీ వృద్ధి ఉంటుందని తాను అనుకొవడం లేదన్నారు. మూడవ, నాల్గో త్రైమాసికాల్లో ప్రోత్సాహకర వృద్ధి రేటును సాధించడం ఐటీ పరిశ్రమ ముందున్న సవాల్‌ అని బాలకృష్ణన్ చెప్పారు. ఇక ఐటీ రంగంలో నియామకాల్లో నెలకొన్న మందకొడితనం మరికొన్నాళ్లు కొనసాగుతుందని బాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Hiring in India’s IT sector will be slower in future, says a senior figure in the technology field, who also did not sound optimistic about the industry achieving 7-8 percent export growth in this fiscal.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి