IT Hub: వీళ్లు నన్ను చంపేస్తారు, కాపాడండి, నా చావుకు ఆ పోలీసులు కారణం, అమ్మాయి కేసుతో !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో పోలీసులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు పోలీసులు అనవసరంగా కేసు నమోదు చేస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఓ యువకుడు ఈ పోలీసులు నన్ను చంపేస్తారు, దేవుడా మీరే నన్ను కాపాడండి అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. ఇటీవల మాన్యతా టెక్ పార్క్ సమీపంలో అర్దరాత్రి కార్తీక్ దంపతులు సమీపంలోని ఇంటికి నడుచుకుంటూ వెలుతుంటే వారిని బెదిరించి గూగుల్ పే ద్వారా లంచం తీసుకున్న పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ వివాదం తెరమరుగు కాకముందే బెంగళూరులో మరో ఇద్దరు పోలీసుల స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

అమ్మాయి విషయంలో పోస్టు చేసి ?
బెంగళూరు నగరంలో నందీష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఓ యువతిని అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ రాజరాజేశ్వరి నగర పోలీసులు నందీష్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవల నందీష్ కోర్టులో బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటు వచ్చాడు.

నా చావుకు ఇద్దరు పోలీసులు కారణం
జైలు నుంచి విడుదల అయిన నన్ను ఈ పోలీసులు చంపేస్తారని నందీష్ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఇప్పటికే నా మొబైల్ ఫోన్ అక్రమంగా పోలీసులు వారి దగ్గర పెట్టుకున్నారని, నా చావుకు పోలీసులు నవీన్, యదుకుమార్ కారణం అంటూ నందీష్ ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.

అమ్మాయి కేసు+ చోరీ కేసు పెట్టారు
అమ్మాయి కేసులో అరెస్టు అయిన తన మీద పోలీసులు చోరీ చేశానని తప్పుడు కేసు నమోదు చేశారని నందీష్ ఆరోపిస్తున్నాడు. నందీష్ ఫేస్ బుక్ పోస్టు గమనించామని, చట్టపరంగా తాము చర్యలు తీసుకుంటామని, ఇద్దరు కానీస్టేబుల్ నుంచి వివరాలు సేకరిస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు.

అర్దరాత్రి గూగుల్ పేతో లంచం
ఇటీవల మాన్యతా టెక్ పార్క్ సమీపంలో అర్దరాత్రి కార్తీక్ దంపతులు సమీపంలోని ఇంటికి నడుచుకుంటూ వెలుతుంటే కానీస్టేబుల్ నాగేష్, రాజేష్ గస్తీ తిరుగుతూ దంపతులను అడ్డగించారు. దంపతులను బెదిరించిన ఇద్దరు పోలీసులు వారిని బెదిరించి రూ. వెయ్యి రూపాయలు గూగుల్ పే ద్వారా లంచం తీసుకుని అడ్డంగా బుక్కైపోయారు. ఇప్పటికే కానీస్టేబుల్ రాజేష్, నాగేష్ ను సస్పెండ్ చేసిన డీసీపీ విచారణకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications