IT Hub: బేకరీ దాడి కేసులో ట్విస్ట్, సీసీటీవీ కెమెరాల దెబ్బకు హోటల్ యజమాని !
బెంగళూరు: బెంగళూరులోని కుందలహళ్లి గేట్ మెయిన్ రోడ్డులోని బేకరీలో చొరబడి అక్కడ ఉన్న యువకుల మీద దాడి చేసిన కేసులో ప్రముఖ హోటల్ యజమానితో పాటు ముగ్గురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బేకరీలో దాడి జరిగిన కేసు ఊహించని మలుపు తిరగడంతో స్థానికులు హడలిపోయారు.
బెంగళూరులోని హెచ్ఏఎల్ లోని అశ్వథ్ నగర్ లో నివాసం ఉంటున్న కార్తీక్ (20), సల్మాన్ (23), మారతహళ్లి కార్తీ (23) అనే ముగ్గురిని అరెస్టు చేశామని శనివారం బెంగళూరు సిటీ పోలీసు అధికారులు చెప్పారు. యువకుల దాడిలో తీవ్రగాయాలైన నవీన్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అన్నారు.

అరెస్టు అయిన కార్తీక్ కంగేరిలోని తాజ్ వెస్ట్ హెటల్ మేనేజింగ్ డైరెక్టర్ అని పోలీసు అధికారులు అన్నారు. నవీన్, ప్రజ్వల్ అనే ఇద్దరు యువకులు స్నేహితులు, బతకడానికి ఇద్దరూ యువకులు బేకరి పెట్టారు. రాత్రి 11 గంటల సమయంలో బేకరీ దగ్గరకు వెళ్లిన కార్తీక్, కార్తీ, సల్మాన్ ఇక్కడ ఎవడురా బేకరీ ఓనర్ అని అడిగారు.
నవీన్ సమాధానం చెబుతున్న సమయంలోనే అక్కడే ఉన్న హెల్మెట్ తీసుకుని అతన్ని చితకబాదేశారు. బేకరీలోని యువకుల మీద దాడి జరగడంతో బెంగళూరు బేకరీ యజమానుల సంఘం నాయకులు హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. ఈ దాడి కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని బెంగళూరు సిటీ పోలీసు కమీసర్ ప్రతాప్ రెడ్డి శనివారం మీడియాకు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications