జైల్లో శశికళ, ఇళవరసిని విచారణ, ఐటీ శాఖ ప్లాన్: కర్ణాటక అధికారులకు లేఖ, అనుమానం!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు/చెన్నై: ఆదాయానికి మించి ఆక్రమాస్తులు సంపాధించారని నాలుగేళ్లు జైలు శిక్షకు గురైన శశికళ, ఆమె వదిన ఇళవరసికి మళ్లీ చిక్కులు మొదలైనాయి. ఆదాయపన్ను శాఖ దాడుల్లో చిన్నమ్మ శశికళ, ఇళవరసి పేర్ల మీద ఐటీ శాఖ లెక్కలో లేని అక్రమాస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించారని తెలిసింది.

శశికళ వదిన ఇళవరసి కుమార్తెలు కృష్ణప్రియ, షకీల, జాజ్ సినిమాస్ సీఇవో, జయ టీవీ ఎండీ వివేక్ ను ఐటీ శాఖ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కృష్ణప్రియ, షకీల, వివేక్ ను విచారించి వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత శశికళ, ఆమె వదిన ఇళవరసిని విచారణ చెయ్యాలని ఐటీ శాఖ నిర్ణయించిందని తెలిసింది.

IT Officials conduct the enquiry with Sasikala and Ilavarasi in the Bengaluru Prison

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ, ఇళవరసిని విచారణ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని ఐటీ శాఖ అధికారులు కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు లేఖ రాశారని సమాచారం. ఐటీ శాఖ దాడుల వెనుక కేంద్రంలోని పెద్దలు, తమిళనాడులోని సీనియర్ నాయకుల హస్తం ఉంటుందని శశికళ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. అయితే శశికళ కుటంబ సభ్యులు ఇప్పటి వరకూ బహిరంగంగా ఐటీ శాఖ దాడులకు కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలకు సంబంధం ఉందని ఆరోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sources said that the Income Tax Officials will conduct the enquiry with Sasikala and Ilavarasi in the Bengaluru Prison on the raids.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి