మంత్రి ఇంటిపై ఐటీ మెరుపుదాడి- 40 చోట్ల: సీఎంకు రైట్ హ్యాండ్: ముందే చెప్పిన బీజేపీ చీఫ్
చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు చెందిన కీలక నాయకుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు చేపట్టారు. ఈ తెల్లవారు జాము నుంచీ ఈ దాడులు కొనసాగుతున్నాయి. విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ నివాసం, కార్యాలయంపైనా ఏకకాలంలో దాడులు చేపట్టారు ఐటీ అధికారులు.
ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి తాము దూరంగా ఉంటామంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించిన మూడో రోజే- ఆయన మంత్రివర్గ సభ్యుడు సెంథిల్ బాలాజీ.. ఆదాయపు పన్ను శాఖ అధికారుల రాడార్‌లోకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడులను రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తోంది డీఎంకే.

ఎక్సైజ్ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న సెంథిల్ బాలాజీపై అందిన ఫిర్యాదుల ఆధారంగానే ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారని, ఇందులో రాజకీయ కోణం ఏ మాత్రం లేదంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు. డీఎంకే చేస్తోన్న ఆరోపణలను వారు తోసిపుచ్చుతోన్నారు. ఆయన మాత్రమే కాదని, మరికొందరు మంత్రులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదిస్తోన్నారంటూ మండిపడుతున్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును తమిళనాడుకు తిరిగి పంపుతామంటూ తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అన్నామలై ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో సెంథిల్ బాలాజీని అరెస్ట్ అవుతారని కూడా స్పష్టం చేశారాయన. దీనిపై సెంథిల్ బాలాజీ అప్పట్లో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా అన్నామలై ఎప్పుడు అపాయింట్ అయ్యారంటూ సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏమిటంటూ ప్రశ్నించారు.
கரூர் ராமகிருஷ்ணபுரத்தில் உள்ள செந்தில் பாலாஜியின் தம்பி அசோக் வீட்டில் அதிகாரிகள் சோதனையிட சென்ற போது பெண் அதிகாரியிடம் கரூர் மாநகராட்சி கவிதா கணேசன் உள்ளிட்டவர்கள் வாக்குவாதம். #ITraid pic.twitter.com/phszkZbmno
— மகாலிங்கம் பொன்னுசாமி / Mahalingam Ponnusamy (@mahajournalist) May 26, 2023
వారిద్దరి మధ్య ఈ మాటలదాడి జరిగిన అతి కొద్దిరోజుల్లోనే అన్నామలై చెప్పినట్టే- ఐటీ అధికారులు దాడులు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడులు చెన్నై, కోయంబత్తూరు, కరూర్.. వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. సెంథిల్ బాలాజీ పర్యవేక్షిస్తోన్న మంత్రిత్వ శాఖతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, ఆయనకు సన్నిహితంగా ఉండే వారిని టార్గెట్ చేశారు.
Income Tax Officials rounded and their car was attacked in #Karur
— மகாலிங்கம் பொன்னுசாமி / Mahalingam Ponnusamy (@mahajournalist) May 26, 2023
வருமானவரித் துறை அதிகாரிகள் வந்த கார் மீது தாக்குதல் #ITraid pic.twitter.com/Gz2dlz9iSr
తాజాగా చేపట్టిన ఈ మెరుపుదాడులు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోన్నాయి. ఈ దాడుల సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఐటీ అధికారులను స్థానిక డీఎంకే నాయకులు, సెంథిల్ బాలాజీ అనుచరులు అడ్డుకున్నారు. వారి వాహనాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications