జయ టీవిపై ఐటీ దాడులు: మరో 160ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు..
జయటీవిపై ఐటీ దాడుల విషయం తెలియడంతో.. దినకరన్ చెన్నై నుంచి బెంగళూరు బయలుదేరే అవకాశముంది.
Recommended Video

చెన్నై: చెన్నై లోని జయ టీవి కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జయ టీవిపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉండటంతో.. ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
10మంది సభ్యులతో కూడిన బృందం జయ టీవి కార్యాలయంలో ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. జయ టీవి డైరెక్టర్ వివేక్ ఇంటిపై కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇకట్టుతుంగలో ఉన్న జయ టీవి కార్యాలయం ప్రస్తుతం శశికళ-దినకరన్ ఆధీనంలో ఉంది.

జయ టీవితో పాటు బెంగళూరులోని పుహాలెందిలో ఉన్న శశికళ సన్నిహితుల ఇంటిపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, అన్నాడీఎంకె పార్టీకి జయ టీవి అధికారిక మీడియా ఛానెల్ అన్న సంగతి తెలిసిందే. జయటీవిపై ఐటీ దాడుల విషయం తెలియడంతో.. దినకరన్ చెన్నై నుంచి బెంగళూరు బయలుదేరే అవకాశముంది.

ఇదిలా ఉంటే, పన్ను ఎగవేత ఆరోపణలతోనే తాము సోదాలు చేస్తున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. తమిళనాడువ్యాప్తంగా మరో 160వేర్వేరు ప్రాంతాల్లోను ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు చేస్తున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications