వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : ప్రముఖ వజ్రాల వ్యాపార సంస్థపై ఐటీ దాడులు, 23 చోట్ల సోదాలలో కోట్లలో భారీ ఫ్రాడ్ గుర్తింపు

|
Google Oneindia TeluguNews

గుజరాత్ రాష్ట్రంలోని వజ్రాల వ్యాపారుల గుట్టు రట్టు చేసే పనిలో పడింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్. సంపన్న వర్గాలు మాత్రమే తమ హోదా ప్రతిబింబించేలా వజ్రాభరణాలపై ఆసక్తి చూపుతారు. ఇక అలాంటప్పుడు వజ్రాల వ్యాపారానికి కూడా ప్రత్యేకమైన స్థానమే ఉంటుంది . అలాంటి వజ్రాల వ్యాపారంలోనూ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా దేశంలోనే ఫేమస్ అయిన గుజరాత్ లోని బడా వజ్రాల వ్యాపార సంస్థల ఆర్ధిక నేరాల గుట్టు రట్టు చేసే పనిలో పడింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్.

గుజరాత్ డైమండ్ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు, పన్ను ఎగవేత గుర్తింపు
గుజరాత్‌లోని ప్రముఖ వజ్రాల తయారీదారు మరియు ఎగుమతిదారు కంపెనీపై జరిపిన దాడులలో కోట్ల రూపాయల పన్ను ఎగవేతను ఆదాయపు పన్ను శాఖ గుర్తించిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈరోజు వెల్లడించింది. గుజరాత్ లోని వజ్రాల తయారీదారులు మరియు ఎగుమతిదారుల ప్రముఖ కంపెనీ లావాదేవీలపై తనిఖీలు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభించింది. గుజరాత్‌లోని సూరత్, నవసారి, మోర్బి మరియు వాంకనేర్ (మోర్బీ) మరియు మహారాష్ట్రలోని ముంబైలో వజ్రాల తయారీ వ్యాపారంలో ఉన్న సంస్థకు సంబంధించిన 23 చోట్ల ఈ తనిఖీలు ప్రారంభించబడ్డాయి. ప్రస్తుతం ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపింది.

IT Raids on Gujarat diamond firm, searches in 23 places, Multi-Crore Fraud Suspected

డైమండ్ స్క్రాప్ ను విక్రయించి 95 కోట్ల రూపాయలకు పైగా లెక్కల్లో చూపని ఆదాయం
అధికారులు సేకరించిన డేటా యొక్క ప్రాధమిక విశ్లేషణలో కంపెనీ ఒక కాల వ్యవధిలో దాదాపుగా 518 కోట్ల చిన్న పాలిష్ చేసిన వజ్రాలను కొనుగోలు చేసినట్టు, విక్రయాలను చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు వజ్రాల తయారీ కార్యకలాపాల నుండి వచ్చిన డైమండ్ స్క్రాప్ ను విక్రయించి 95 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించినట్టు డేటా వెల్లడించింది. ఇది లెక్కించబడని ఆదాయం అని, ఈ ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటనలో పేర్కొంది.

లెక్కల్లో లేని 1.95 కోట్ల విలువైన ఆభరణాలు, 10.98 కోట్ల విలువైన 8,900 క్యారెట్ల డైమండ్ స్టాక్
సంవత్సరాలుగా, సంస్థ పుస్తకాలలో దాదాపు 2,742 కోట్ల చిన్న వజ్రాలను విక్రయించారని, దీనికి విరుద్ధంగా, కొనుగోళ్లలో గణనీయమైన భాగం నగదు రూపంలో జరిగిందని, అయితే కొనుగోలు బిల్లులు ఫేక్ గా వసతి ఎంట్రీ ప్రొవైడర్ల నుండి తీసుకున్నాయని ఆరోపించింది. ఈ దాడుల్లో లెక్కలోకి రాని నగదు మరియు ఆభరణాలు 1.95 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని,10.98 కోట్ల విలువైన 8,900 క్యారెట్ల లెక్కలోకి రాని డైమండ్ స్టాక్ కనుగొనబడిందని పేర్కొన్నారు.

పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తింపు .. ఇప్పటి వరకు రూ. 81 కోట్ల లెక్క చూపని ఆదాయం
వజ్రాల వ్యాపారుల గ్రూప్ సభ్యులకు పెద్ద సంఖ్యలో లాకర్‌లు గుర్తించబడ్డాయని, ఇక వాటిని తనిఖీలు చేస్తున్నామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అధికారులు వెల్లడించారు. హాంకాంగ్ రిజిస్టర్డ్ కంపెనీ ద్వారా పూర్తి చేసిన వజ్రాల దిగుమతులు మరియు ఎగుమతి అమ్మకాల ద్వారా గ్రూప్ లావాదేవీలు జరుపుతుంది. ఈ గ్రూప్ వజ్రాలను పెద్ద ఎత్తున కొనుగోళ్ళు చేస్తున్నట్లు పన్ను శాఖకు సంబంధించిన పాలసీ-మేకింగ్ బాడీ తెలిపింది. ఈ సంస్థ కార్యాకలాపాలు భారతదేశంలోనే సమర్థవంతంగా నియంత్రించబడుతుంది మరియు నిర్వహించబడుతుందని పేర్కొంది . గత రెండు సంవత్సరాలలో 189 కోట్ల రూపాయల కొనుగోళ్లు మరియు 1,040 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయని డేటా చూపుతుంది. ఇందులో రూ. 81 కోట్ల లెక్క చూపని ఆదాయం కనుగొనబడిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టాక్సెస్ వెల్లడించింది

English summary
The Central Board of Direct Taxes (CBDT) has said that the Income Tax department has identified crores of rupees of tax evasion in IT raids on Gujarat's leading diamond firm. It said it had detected massive fraud in 23 other searches
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X