కారణం ఇదీ: 6.4 లక్షల ఉద్యోగాలు కోల్పోనున్న భారత ఐటీ
ముంబై: రాబోయే ఐదేళ్లలో భారత ఐటీ పరిశ్రమలోని ఉద్యోగాలలో భారీగా కొత పడనుంది. అమెరికాకు చెందిన ఓ అధ్యయన సంస్థ ప్రకారం ఐటీ పరిశ్రమలో ఆటోమిషన్‌ను అమలు చేయడం ద్వారా ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్న తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని సర్వే వెల్లడించింది.
దీని ప్రభావం భారత్‌లోని సుమారు 6.4 లక్షల ఉద్యోగులపై పడనున్నట్లు సమాచారం. అమెరికాకు చెందిన హెచ్ఎఫ్ఎస్ అనే రీసెర్చ్ సంస్ధ అధ్యయన ప్రకారం 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం లేదా 1.4 మిలియన్ ఉద్యోగాల కోత పడనున్నట్లు సర్వేలో పేర్కొంది.
ఈ ఆటోమేషన్ ప్రభావం ముఖ్యంగా ఫిలిఫ్పేన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌తో పాటు భారత్‌పై కూడా పడనుందని పేర్కొంది. ఈ సర్వేపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

నాస్కామ్ అభిప్రాయం ప్రకారం ఆటోమిషన్ కానీ రోబోటిక్స్ వినియోగం కానీ ఐటీ పరిశ్రమను ఎలా లీడ్ చేస్తదో ఎవరికీ తెలియదని పేర్కొంది. ఆటోమిషన్ రాకవల్ల కొంత ప్రభావం పడనుంది. కానీ కొత్త టెక్నాలజీ వినియోగం వల్ల కొత్త ఉద్యోగాల కల్పన సైతం జరుగుతుందని పేర్కొంది.
ముఖ్యంగా ఈ ఆటోమేషన్ వల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ రంగంలో అదేవిధంగా బీపీవో రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. ఆటోమిషన్ వినియోగం వల్ల ఒకవైపు తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు 30 శాతం పడిపోనుండగా మరోవైపు మీడియం స్కిల్డ్ ఉద్యోగాలు 8 శాతం పెరగనున్నట్లు ఐటీ పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు.
మరోవైపు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు 56 శాతం పెరగుతాయని నిపుణలుు చెబుతున్నారు. 1477 ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్‌పై హెచ్ఎఫ్ఎస్ తన సర్వేని నివేదిక రూపంలో సమర్పించింది. ఐటీ నిపుణలు సైతం ఆటోమేషన్ రాకతో ఉద్యోగాలు తగ్గుతాయని చెప్తుండటం విశేషం.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications