వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది "యతి'' కాదు, అడవి ఎలుగుబంటి : నేపాల్ అర్మీ

|
Google Oneindia TeluguNews

గత రెండు రోజుల క్రితం హిమాలయాల్లో భారత ఆర్మీ ప్రకటించినట్టుగా అతిపెద్ద మంచు మనిషి యతి అడుగు జాడలు కావని , నేపాల్ అర్మీ అధికారులు స్పష్టం చేశారు. అది ఒక అడవి ఎలుగుబంటి అడుగులని భారత ఆర్మీ వాదనలను కొట్టిపారేశారు.

 యతి అడుగుజాడలు

యతి అడుగుజాడలు

హిమలయాల్లో యతి అడుగుజాడలు ఉన్నాయంటూ స్వయంగా ఎప్రిల్ 9న హిమాలయాల్లో సహస యాత్రకు వెళ్లిన ఆర్మీ బృందం యతి అడుగులను గుర్తించినట్టు ఫోటోలతో సహ ట్వీట్ చేశారు. ఈ పాదాలు 32 అంగుళాల పోడవు 15 అంగుళాల వెడల్పుతో ఉన్నాయని వీటిని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు అర్మీ అధికారులు . దీనికి తోడు గతంలో కూడ బరున్ నేషనల్ పార్క్ సమీపంలో యతి అడుగులు కన్పించినట్టు సైన్యం చెబుతోంది.

ఆసక్తిగా స్పందించిన నెటిజన్లు

ఆసక్తిగా స్పందించిన నెటిజన్లు


కాగా మంచుకొండల్లో యతి అడుగు జాడలు ఉన్నాయని స్వయంగా ఆర్మీ ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. నిజంగానే మంచు మనిషి ఉన్నాడా అంటూ చాల మంది ఆసక్తిగా కామెంట్స్ పెట్టారు. దీంతో పాటు మీడియా కూడ రావడంతో ప్రజలు సైతం దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పురాణాల్లో చెప్పుకున్నట్టుగా యతి నిజంగా ఉందా అంటూ ఆసక్తి కనబరిచారు.

భారత ఆర్మీ ట్వీట్ ను కోట్టిపారేసిన నేపాల్ ఆర్మీ అధికారులు

భారత ఆర్మీ ట్వీట్ ను కోట్టిపారేసిన నేపాల్ ఆర్మీ అధికారులు


అయితే ఇది జరిగిన రెండు రోజులకే నేపాల్ ఆర్మీ అధికారులు స్పందించారు. ఇండియన్ ఆర్మీ అధికారులు చెబుతున్నట్టుగా పురాణాల్లో చెప్పినటువంటి యతి కాదని అది ఒక అడవి ఎలుగుబంటి అంటూ నేపాల్ కు ఆర్మీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ బిగ్యాన్ దేవ్ పాండే ఓ నేషనల్ మీడియాతో తెలిపారు. అలాంటీ అడుగులు ఆ రిజియన్ లో ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయని చెప్పారు.

English summary
The Nepal Army has dismissed the Indian Army's claims that mysterious footprints seen near a base camp in the Himalayas could belong to the mythical creature Yeti. A Nepal Army officer said the footprints were likely that of a wild bear. Wild bears are known to frequent the region where an Indian Army team came across the giant-sized footprints.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X