పార్టీ జంప్, ఢిల్లీకి రావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యేకు హైకమాండ్ ఆదేశాలు!
బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరు నగరంలోని యశవంతపురం బీజేపీ ఎమ్మెల్యే ఎస్ టీ సోమశేఖర్ కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయమై సోమశేఖర్ మాట్లాడుతూ ఆగస్టు 25న ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌తో సమావేశం కానున్నట్టు తెలిపారు. ఆ తర్వాతే తాను తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ మంగళవారం తెలిపారు.
సోమశేఖర్ మద్దతుదారులు పలువురు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. మరుసటి రోజు సోమశేఖర్‌ను ఢిల్లీకి రావాలని బీజేపీ హైకమాండ్ సూచించింది. నేను ఆగస్టు 25న ఢిల్లీ వెళ్తున్నాను. సీనియర్ నేతలతో సమావేశమైన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని, బీజేపీ హైకమాండ్‌తో భేటీకి ముందు ఎలాంటి నిర్ణయం ప్రకటించవద్దని తనను కోరాని, అందుకే తాను అంగీకరించాను, ఆతర్వాత ఏం జరుగుతుందో చూద్దాం' అని బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ అన్నారు.

ఇటీవల సోమశేఖర్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, శివకుమార్‌లను కలిసి తన నియోజకవర్గానికి తాగునీరు సరఫరా చేసేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) నిర్వాహకులు యశవంతపురం నియోజకవర్గానికి ఏకంగా రూ. 7.63 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
తాగునీటికి డబ్బులు చెల్లించాలని విన్నవించినా విడుదల చేయలేదు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని కలిసి డబ్బులు ఇవ్వాలని కోరాను. కాంగ్రెస్‌లోకి రావాలని నన్ను ఎవరూ ఆహ్వానించలేదని బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ అన్నారు. తన మద్దతుదారులు కాంగ్రెస్‌లో చేరడంపై అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే స్పందిస్తూ రాబోయే బీబీఎంపీ ఎన్నికల కోసం ఇది వాళ్లు తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. '
నేను కొందు నాయకులకు కార్పొరేటర్ గా పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చాను. కానీ, వారు నన్ను నమ్మలేదు. అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరితే ప్రయోజనం ఉంటుందని భావించారు. పార్టీ టిక్కెట్టు హామీ ఇస్తే మళ్లీ బీజేపీలోకి రావచ్చు అని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ అన్నారు. మాజీ సీఎంలు బీఎస్ యడ్యూరప్ప, బసవరాజ్ బోమ్మయ్ ఇతర నేతలు సోమశేఖర్‌తో చర్చలు జరిపి ఆయన బీజేపీలోనే ఉండేందుకు ఒప్పించారు.












Click it and Unblock the Notifications