కుప్వారాలో మంచు చరియలు పడి 9మంది గల్లంతు

Subscribe to Oneindia Telugu

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో హిమపాతం అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కాగా, కుప్వారా జిల్లాలో శుక్రవారం మంచు చరియలు విరిగిపడి దాదాపు తొమ్మిది మంది గల్లంతయ్యారు. ఆరుగురు ప్రయాణికులతో కుప్వారా నుంచి కర్నాహ్‌ వెళ్తున్న ఓ వాహనంపై మంచు చరియలు పడడంతో ఆ వాహనంలోని ఆరుగురు, అదే మార్గంలో వెళ్తున్న మరో ముగ్గురు కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

9 people missing as avalanche strikes car in Kupwara

పోలీసు బృందాలు, సైనిక సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, మౌంటెన్‌ రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

గల్లంతైన వారిలో సరిహద్దు రోడ్డు ఆర్గనైజేషన్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. వెలుతురు లేకపోవడం, ఉష్ణోగ్రతలు సున్నా కంటే అత్యంత తక్కువగా ఉండటం వల్ల సహాయ చర్యలు కష్టతరమవుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nine people, including a vehicle carrying six people, go missing in avalanche in north Kahmir's Kupwara district on Friday afternoon. Out of the nine people, six were in an SUV, while others were on the road.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి