వివాదాస్పదం: పీవోకే, కాశ్మీర్‌పై ఫరూక్ అబ్దుల్లా, రిషి కపూర్ పాకిస్తాన్ భజన

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై/శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఫరూఖ్ అబ్దుల్లా పాకిస్థాన్‌కు అనుకూలంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పాకిస్థాన్‌‌కే చెందుతుందని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్-భారత్‌ మధ్య ఎన్ని యుద్ధాలు జరిగినా ఇందులో ఏమాత్రం మార్పు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. మూడు న్యూక్లియర్‌ శక్తులైన చైనా, పాకిస్థాన్‌, భారత్‌ మధ్య కాశ్మీరు లోయ ఉన్నందున స్వేచ్ఛ, స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకోవడం కూడా తప్పేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

J&K is Ours and PoK is Theirs: Rishi Kapoor Agrees With Farooq Abdullah

ప్రేమతో భారత్‌‌లో కలవాలని తాము నిర్ణయించుకున్నామని ఫరూక్ చెప్పారు. భారతదేశం కాశ్మీరు ప్రజలను దగా చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

అనంతరం, ఫరూక్ వ్యాఖ్యలపై నటుడు రిషి కపూర్ స్పందించారు. ఆయనకు, పాక్‌కు అనుకూలంగా మాట్లాడారు. పీవోకే పాక్‌లో అంతర్భాగమే అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్ము కాశ్మీర్‌ను భారత్ తన ఆదీనంలో ఉంచుకొని, పీవోకేను పాక్‌కు అప్పగించాలన్నారు.

తనకు ఇప్పుడు 65 ఏళ్ల వయస్సు ఉందని, తాను చనిపోయేవరకైనా పాక్ వెళ్తానో లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తన పిల్లలకైనా పాక్‌లో తమ మూలాలు తెలుస్తాయో లేదో అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Veteran actor Rishi Kapoor has stepped into the controversy stirred by Farooq Abdullah on Saturday by agreeing with the National Conference supremo’s statement that Pakistan-occupied Kashmir (PoK) belongs to Pakistan and those on the Indian side should stop talking about “azadi”.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి