జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి షాక్..!
జమ్మూ కాశ్మీర్ లో నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో అక్కడ అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్(NC) పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ ఒక స్థానానికి పరిమితం అయింది. 2019లో జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికలు కావడం విశేషం. ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్(NC) పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లలో మూడింటిని కైవసం చేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఒక స్థానానికి మాత్రమే పరిమితం అయింది.
ఈ మేరకు అధికార నేషనల్ కాన్ఫరెన్స్(NC) పార్టీ ప్రకటన విడుదల చేసింది. తమ అభ్యర్థులు చౌదరీ మహ్మద్ రంజాన్ తొలి రాజ్యసభ సీటును గెలుపొందారు. సజాద్ కిచ్లూ రెండో రాజ్యసభ సీటును అలాగే తమ పార్టీ కోశాధికారి జీఎస్ ఒబెరాయ్ మూడో రాజ్యసభ సీటును కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక మిగిలిన నాలుగో సీటును బీజేపీ చేజిక్కించుకుంది. బీజేపీ అభ్యర్థి సత్ శర్మ.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ నభీ ధార్ పై విజయం సాధించారు. 54 ఓట్లలో 32 ఓట్లు సాధించి విక్టరీ కొట్టారు. ఫలితాల అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్(NC) పార్టీ కార్యాలయంలో సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఫలితాల విడుదల అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్(NC) పార్టీ అధినేత ఒమర్ అబ్దుల్లా.. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా గ్రీటింగ్స్ పంపారు. చౌదరీ మహ్మద్ రంజాన్, సజాద్ కిచ్లూ, జీఎస్ ఒబెరాయ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తమ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ నభీ ధార్ ఓటమిపై విచారం వ్యక్తం చేశారు. చివరి వరకూ ధార్ పోరాటం చేశారని కొనియాడారు. అతడికి త్వరలోనే మరిన్ని అవకాశాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications