వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ జగన్ అటు, కనిమొళిటు: ఇక్కడ తల్లి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: రాష్ట్ర సమైక్యత ప్రయత్నాల్లో భాగంగా జాతీయ నాయకులను కలుస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, మాజీ సిఎం, డిఎంకె చీఫ్ కరుణానిధిని కలిసి మద్దతు కోరారు.

తమ పార్టీకి చెందిన కొంతమంది నేతలతో కలిసి చెన్నైలోని సెక్రటేరియట్‌లో జయలలితతో భేటీ అయిన జగన్ దాదాపు అరగంట సేపు ఆమెతో చర్చలు జరిపారు. అలాగే గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఆయనను కలిశారు. అనంతరం జగన్ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రాల విభజనకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని 3వ అధికారణాన్ని సవరించాలన్న తమ డిమాండ్‌పై ఈ ఇద్దరు నాయకులకు వివరించడానికి తాము ప్రయత్నించామని, దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నది వారి ఇష్టమని చెప్పారు.

ఈ రోజు ఆంధ్ర అయింది, రేపు మరో రాష్ట్రం కావొచ్చునని, ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు కూడా సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలన్న డిమాండ్‌ను సమర్థించాలన్నారు. మరోవైపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పైన వైయస్ విజయమ్మ గుంటూరు జిల్లా పులిచింతలలో ధర్నా నిర్వహించారు.

జగన్ 1

జగన్ 1

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెన్నై సచివాలయంలో ముఖ్యమంత్రి జయలలితను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు.

జగన్ 2

జగన్ 2

తమిళనాడు రాజధాని గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఆయనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ నేతలతో కలిశారు. పక్కన కనిమొళి దృశ్యం.

జగన్ 3

జగన్ 3

తమిళనాడు రాజధాని గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఆయనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసి ముచ్చటిస్తున్న దృశ్యం. పక్కన స్టాలిన్, నిలబడిన కనిమొళి.

జగన్ 4

జగన్ 4

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెన్నై గోపాలపురంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు.

జగన్ 5

జగన్ 5

తమిళనాడు రాజధాని చెన్నైలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది.

జగన్ 6

జగన్ 6

చెన్నైలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. దీంతో ట్రాఫిక్‌కు సమస్య ఏర్పడింది.

విజయమ్మ 1

విజయమ్మ 1

గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నీటి పోరు ధర్నాను నిర్వహించారు.

విజయమ్మ 2

విజయమ్మ 2

గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నీటి పోరు ధర్నాలో మాట్లాడుతున్న దృశ్యం.

విజయమ్మ 3

విజయమ్మ 3

గుంటూరులోని పులిచింతల ప్రాజెక్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నీటి పోరు ధర్నాలో మాట్లాడుతున్న దృశ్యం.

English summary

 In his bid to garner support for a united Andhra Pradesh, YSR Congress president Y S Jaganmohan Reddy met Tamil Nadu chief minister and the AIADMK supremo J Jayalalithaa and DMK chief M Karunanidhi in Chennai on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X