ధన్‌ఖర్ అప్పుడు చెబితే అందరూ నవ్వుకున్నారు గానీ..
Jagdeep Dhankhar: ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ సోమవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ పంపించారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి, వైద్యుల సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఈ లేఖలో తెలిపారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం వెంటనే తన రాజీనామా అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ధన్ ఖర్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు మార్గం సుగమమైంది. 74 సంవత్సరాల ధన్‌ఖర్ 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది.

రాజ్యసభ ఛైర్మన్ కూడా అయిన ధన్‌ఖర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉంది. ఆ పార్టీ ప్రతిపాదించే నాయకుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ధన్‌ఖర్ రాజీనామా నిర్ణయం ఎన్డీఏ కూటమిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్త ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుత గవర్నర్లు, పార్టీ సీనియర్ నాయకులు లేదా కేంద్రమంత్రుల్లో ఒకరిని బీజేపీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
ధన్‌ఖర్ ఉప రాష్ట్రపతి కాకముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. ఆయనకు ముందు ఉప రాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు కూడా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2017లో ఆయనను బీజేపీ ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది.
ఉపరాష్ట్రపతి పదవికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన ఎంపీ. హరివంశ్ 2020 నుండి ఆ పదవిలో కొనసాగుతున్నారు. వీవీ గిరి, ఆర్. వెంకట్రామన్ తర్వాత అర్ధాంతరంగా పదవి నుంచి తప్పుకొన్న మూడో రాష్ట్రపతి ధన్‌ఖర్.
తాను పూర్తికాలం పాటు పదవిలో కొనసాగబోనంటూ ధన్ ఖర్ ఇదివరకే పరోక్షంగా ప్రస్తావించారు కూడా 2027 ఆగస్టు వరకు తన పదవీ కాలం ఉందని, అప్పటి వరకు కొనసాగుతానా? లేదా అనేది దైవ నిర్ణయమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
జూలై 10వన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి ధన్‌ఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన రాజీనామా అంశం, పూర్తి కాలం పాటు పదవిలో కొనసాగడంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దైవ నిర్ణయం అనుకూలిస్తే 2027 ఆగస్టులో వరకు కొనసాగుతానని, లేదంటే సరైన సమయంలో పదవీ విరమణ చేస్తాననని అన్నారు. ఆయన ఈ మాట అన్నప్పుడు అందరూ గట్టిగా నవ్వడం వినిపించిందా వీడియోలో. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే నిజం అయ్యాయి.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications